Telangana: తెలంగాణలో కరోనా రికవరీ రేటు 93 శాతం

Telangana: గడిచిన 24 గంటల్లో 3,614 మందికి పాజిటివ్‌ గా తేలిందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Update: 2021-05-27 13:45 GMT

తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు (ఫొటో హెచ్‌ఎంటీవీ)

Telangana: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 3,614 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలిందని ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉందని తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాజాగా 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉందని, మరణాల రేటు 0.5 శాతంగా నమోదవుతుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో 17 వేలకుపైగా టీంలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 6 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే చేశారని తెలిపారు. కరోనా ఓపీలో 11,814 మందికి లక్షణాలు ఉన్నాయని గుర్తించామని వివరించారు.

కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 64 ప్రైవేటు హాస్పిటల్స్‌పై 88 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈమేరకు వాటిని పరిశీలించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు. నోటీసులు అందుకున్న ఆస్పత్రులు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News