Nizamabad: గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు.. 80 కుటుంబాల సామాజిక బహిష్కరణ..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు పెరిగిపోతున్నాయి.

Update: 2022-12-27 11:42 GMT

Nizamabad: గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు.. 80 కుటుంబాల సామాజిక బహిష్కరణ..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు పెరిగిపోతున్నాయి. నందిపేట్‌ మండలం శాపూర్‌లో 80 కుటుంబాలను వీడీసీ బహిష్కరించింది. ఓ వ్యక్తికి జరిమానా విధించడంతో ఏర్పడిన వివాదం ఈ పరిస్థితికి దారితీసినట్లు తెలిసింది. ఓ వర్గం వారితో మాట్లాడినా, వ్యవసాయ పనులకు వెళ్లినా..జరిమానా విధిస్తామని గ్రామ అభివృద్ధి కమిటీ ప్రకటించింది. వీడీసీకి 2 లక్షల రూపాయలు చెల్లించాలని ఓ వర్గం కులస్థులను హెచ్చరించారు. తాము బహిష్కరించిన కులస్థుల పిల్లలను ఆటోల్లో ఎక్కించుకోవద్దని హుకూం జారీ చేశారు. వీడీసీని కాదని ఇల్లు నిర్మాణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిపేట పీఎస్‌లో బహిష్కరణకు గురైన కులస్థులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News