Jagtial: ప్రజావాణిలో ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు..!
Jagtial: ప్రజావాణిలో ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు..!
Jagtial: ప్రజావాణిలో ఆరో తరగతి విద్యార్థి ఫిర్యాదు..!
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థి తమ సమస్యలపై ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాత్రూమ్‌లు సరిగా లేవని, కనీసం తాగునీటి సౌకర్యం లేదని విశ్వంక్ అనే విద్యార్థి అధికారికి వినతి పత్రం అందజేశాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికార్లు సంబంధిత అధికారుల ద్వారా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే పాఠశాలలో వసతుల గురించి 6వ తరగతి విద్యార్థి ధైర్యంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం కానీ పాఠశాల విద్యార్థి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.