హైదరాబాద్‌ గోషామహల్‌లో కుప్పకూలిన భవనం

Update: 2019-10-03 06:51 GMT

హైదరాబాద్‌లో మరో పాత భవనం కూప్పకూలింది. కుటుంబసభ్యులు ఖాళీచేసిన రోజు రాత్రే ఆ ఇల్లు కుంగిపోయింది. గోషామహల్‌ పోలీస్‌ స్టేడియం ఎదురుగా చాక్నావాడిలో ఈ ఘటన జరిగింది. ఒక అంతస్తుతో ఉన్న నిర్మాణం 60 ఏళ్ల నాటిదని చెబుతున్నారు.

వర్షాల కారణంగా కొన్ని రోజులుగా కింది అంతస్తు లోపల గోడలు పెచ్చులూడుతుండటంతో రెండు రోజుల క్రితమే వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నట్ల ఇంటి యజమాని తెలిపారు. ఆయన తల్లిదండ్రులు నిన్న ఇంటిని ఖాళీ చేశారు. అయితే మధ్యాహ్నం నుంచే పెచ్చులూడటం పెరిగింది.

రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో కింది అంతస్తు మొత్తం కుప్పకూలి పైఅంతస్తు నేలను తాకింది. ఇంటికి ఇరువైపులా సెల్లార్ల తవ్వకం, నాలుగు అంతస్తుల అనధికార నిర్మాణాలు చేపట్టడంతో ఇంటి గోడలు బలహీనపడినట్లు తెలుస్తోంది. దానికి వర్షాలు తోడవడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు యజమాని కుటుంబం ముందుగా అప్రమత్తమైందని, లేకుంటే ప్రాణనష్టం జరిగేదని అన్నారు.

Full View 

Tags:    

Similar News