యాంటీబాడీస్ తయారీలో మగవాళ్లే బెస్టా?

Update: 2021-03-04 12:19 GMT

యాంటీబాడీస్ తయారీలో మగవాళ్లే బెస్టా?

హైదరాబాద్ లో సగం మందికి కరోనా వచ్చిపోయిందని సీసీఎంబీ అధ్యయనంలో తేలింది. కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తో కలసి సంయుక్తంగా చేసిన పరిశోధనలో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ లో 30 వార్డుల్లో 9 వేలమంది పై జరిపిన అధ్యయనంలో ప్రతీ 54 మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించారు.. నగరంలో 78 శాతం మందిలో యాంటీ బాడీస్ తయారయ్యాయని, మహిళల కన్నా పురుషుల్లో 3 శాతం యాంటీ బాడీస్ ఎక్కువగా అభివృద్ధి చెందాయని సీసీఎంబీ ప్రకటించింది.వయసు పై బడిన వారు, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడే వారిలో యాంటీ బాడీస్ వృద్ధి అంతంత మాత్రంగా ఉందని తేలింది.

Tags:    

Similar News