Saidabad Case: నిందితుడి కోసం జంట నగరాలను జల్లెడ పడుతున్న 500 మంది పోలీసులు

* 1000 సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు * ఉప్పల్‌ సిగ్నల్‌ క్రాస్‌ చేసినట్లు పోలీసుల గుర్తింపు

Update: 2021-09-16 02:17 GMT

చిన్నారిని చిదిమేసిన నిందితుడి కోసం గాలింపు(ఫైల్ ఫోటో)

Saidabad Singareni Case: సైదాబాద్‌లో చిన్నారిని చిదిమేసిన నరరూప రాక్షసుడి కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఏ చిన్న ఆధారాన్ని వదలకుండా అన్ని మార్గాల్లో వెతుకుతున్నారు. దాదాపు 500 మంది పోలీసులు జంటనగరాలను జల్లెడపడుతున్నారు. వెయ్యి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. డీజీపీ మహేందర్ రెడ్డి సిటీలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలన్నారు.

నిందితుడు రాజును ఆరు రోజులైనా పట్టుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రాజాకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో నిందితుడి కోసం నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, లేబర్‌ అడ్డాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. మద్యం, కల్లు దుకాణాల వద్ద పోలీసులు నిఘా పెంచారు. ఉప్పల్ సిగ్నల్ దాటుతూ నిందితుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

అలాగే ఈ నెల 10న నిందితుడు బాలాపూర్‌లో తిరిగినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలిసింది. ఎల్‌బీ నగర్‌లోని మద్యం దుకాణానికి రాజు వెళ్లినట్లు పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. దీంతో ఎల్‌బీ నగర్‌ పరిసరాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు.

రాజు తన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోకి వెళ్లి ఉంటాడని వాళ్ల ఇండ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. నిందితుడు మారు వేషంలో తిరిగే అవకాశం ఉన్నందున జుట్టు, గడ్డం వంటి మార్పులతో నిందితుడిని పోలి ఉండే చిత్రాలను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఇక ఇప్పటికే నిందితుడు రాజును పట్టించిన వారికి 10లక్షలు రివార్డు కూడా ప్రకటించారు. 

Tags:    

Similar News