పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో 500 నాటు కోళ్లు మృతి

Update: 2021-01-31 10:03 GMT

Representational Image

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో 500 నాటు కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. డోనికేన మొగిళి అనే రైతు గ్రామ శివారులో షెడ్డు ఏర్పాటు చేసి కొంతకాలంగా నాటు కోళ్లను పెంచుతున్నారు. రెండు రోజుల క్రితం వింత వ్యాధితో 500 కోళ్లు మృతి చెందినట్లు నిర్వహకుడు తెలిపారు. దీంతో మండల పశువైద్యాధికారి సురేష్ సమాచారం తెలుసుకుని చనిపోయిన కోళ్లకు పోస్ట్ మార్టం నిర్వహించారు. కోళ్ల మృతికి రానిఖీట్ అనే వింత వ్యాధి సోకి చనిపోయినట్లు తెలిపారు. చనిపోయిన కోళ్ల కళేబరాల్లో నట్టలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. కోళ్ల మృతితో దాదాపు రెండున్నర లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

Tags:    

Similar News