Coronavirus: తెలంగాణలో ఒక్కరోజులో కొవిడ్‌తో 33 మంది మృతి

Coronavirus: వారం రోజుల్లోనే పాజిటివ్ రేటు రేట్టింపు * నాలుగు రోజుల వ్యవధిలో 105 మంది మృతి

Update: 2021-04-25 02:29 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. గతవారం రోజులుగా ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో చికిత్స పొందుతూ అత్యధికంగా 33 మంది మృతి చెందారు.. రాష్ట్రంలో తొలికేసు నమోదైనప్పటికీ నుంచి రాష్ట్రంలో సంభవించిన మరణాల్లో ఇవే అత్యధికంగా ఉన్నాయి. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 105 మంది చనిపోయారు.

వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రతిరోజూ పరీక్షల కోసం ప్రజారోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల వద్ద పరీక్షల కోసం ప్రజలు ఉదయాన్నే బారులు తీరుతున్నారు ఈ నెలలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 78వేల పాజిటివ్ వచ్చాయి వారం రోజులుగా ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. జిల్లాల్లో వారం రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. జీహెచ్ఎంసీలో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వారం క్రితం 743 కేసులు ఉండగా శుక్రవారం 14వందల 64 నమోదయ్యాయి.

Tags:    

Similar News