Coronavirus Updates in Telangana : తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-10-04 05:03 GMT

Coronavirus Updates in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల మధ్య 24 గంటల్లో 51,623 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వారిలో 1,949 మందికి కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,99,276కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 10 మంది కరోనాతో మృతి చెందగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,163కి చేరుకుంది.

ఇక నిన్న ఒక్కరోజు 2,366 మంది కోలుకోగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,70,212 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక పోతే రాష్ట్రంలో ప్రస్తుతం 27,901 యాక్టివ్‌ కేసులు ఉండగా వారిలో 22,816 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 32,05,249కి చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదయిన కుసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 291 మంది ఉన్నారు. రంగారెడ్డి 156, మేడ్చల్ మల్కాజిగిరి 150, నల్లగొండ 124, కరీంనగర్ 114, ఖమ్మం 85, సిద్ధిపేట 76. నిజామాబాద్ 66, సూర్యాపేట 65, రాజన్న సిరిసిల్ల 55 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News