దేశంలో 65 లక్షలు దాటిన కరోనా కేసులు!

దేశంలో 65 లక్షలు దాటిన కరోనా కేసులు!
x
Highlights

India Coronavirus Update : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

India Coronavirus Update : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 75,829 కేసులు నమోదు అయ్యాయి.. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 65,49,374కి చేరుకుంది. ఇక కొత్తగా దేశంలో కరోనాతో పోరాడి 940మంది మరణించారు. దీనితో మృతుల సంఖ్య 1,01,782 కి చేరుకుంది. ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 55,09,967 మంది కోలుకోగా, 9,37,625 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ ని విడుదల చేసింది.

రాష్ట్రాల పరంగా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్రలో కొత్తగా 14,348 తాజా కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, అక్కడ మొత్తం కేసుల సంఖ్య 14,30,861కి చేరుకుంది. అటు ఢిల్లీలో కొత్తగా 2,258 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2.87 లక్షలకు చేరుకున్నాయి, మరో 34 మంది కరోనాతో మరణించారు.. దీనితో వారి సంఖ్య 5,472 కు చేరుకుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 3,340 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,66,974 కు చేరుకుంది. 62 మంది కరోనాతో మరణించగా, వారి సంఖ్య 5,132 కు పెరిగింది. ఇక తమిళనాడులో కొత్తగా 5,622 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ కేసుల సంఖ్య 6,14,507 కు చేరుకుంది. మృతుల సంఖ్య 9,718 కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories