వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
YS Bhaskar Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్
YS Bhaskar Reddy: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఆదివారం ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డి నివాసంలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు.