Youtuber Hanumantu: యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Youtuber Hanumantu: ప్రణీత్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు
Youtuber Hanumantu: యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Youtuber Hanumantu: తండ్రీకూతురు బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో.. ప్రణీత్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న బెంగళూరులో ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం.. ట్రాన్సిట్ వారెంట్‌పై ప్రణీత్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అటు.. ప్రణీత్‌తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు.