కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవము

పట్టణంలో 135 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, బస్సు స్టాండ్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ జండాను ఆవిష్కరించారు.

Update: 2019-12-28 10:53 GMT

పటాన్ చెరు: పట్టణంలో 135 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, బస్సు స్టాండ్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజి రెడ్డి విచేసినారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని, ఆ కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ... కష్టసుఖాలు తెలుకుకొన్నారని, మన జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, కానీ తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి 6సం. అయినా, ఒక్క డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని అన్నారు. అదేవిధంగా మన ప్రాతంలో డబల్ బెడ్ రూమ్స్ 60 - 40 నిష్పత్తి పద్దతిలో, లోకల్ వాళ్లకు ఆలాట్మెంట్ చేయాలనీ డిమాండ్ చేసారు.

ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 15,600 ఇళ్లకుగాను, పటాన్ చెరు నియోజకవర్గంలో మూడు డివిషన్ లో 40 శాతం ఇల్లు ఇచ్చినా, 7000 వస్తాయని చెప్పినా డివిజన్ కి 2400 మత్రమే వస్తాయని అన్నారు. 51 గ్రామపంచాయితీలకు 120 నుండి 130 ఇల్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ జిల్లా ఐఎన్టియూసి అధ్యక్షులు నర్సింహారెడ్డి డీసీసీ కార్యదర్శి సామయ్య, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ ఆబీబు జానీ, రామచంద్రపురం మాజీ జడ్పీటీసీ రాగం బిక్షపతి, మాజీ వార్డ్ మెంబెర్ మల్లేష్, మైనారిటీ ప్రెసిడెంట్ మిరాజ్, ప్రధాన కార్యదర్శి రసూల్, నరసింహ మొదలైన వారు పాల్గొన్నారు.

Tags:    

Similar News