Jagtial: ఆత్మకూరులో విషాదం.. కుక్క దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి
Jagtial: వీధికుక్కలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి.
Jagtial: ఆత్మకూరులో విషాదం.. కుక్క దాడిలో 12 ఏళ్ల బాలిక మృతి
Jagtial: వీధికుక్కలు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఆత్మకూరులో ఓ పన్నెండేళ్ల చిన్నారి ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. 15రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారి సాహిత్యను కుక్క దాడి చేసి గాయపరిచింది. బాలికతో పాటు దాదాపు 10మందిపై దాడికి పాల్పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా ఇవాళ మృతి చెందింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.