Telangana: యాదాద్రి ఆలయంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది.

Update: 2021-03-30 13:31 GMT

Telangana: యాదాద్రి ఆలయంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

Telangana: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా 266 కరోనా పరీక్షలు నిర్వహించగా 24 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో పది మంది ఆలయ సిబ్బంది, అర్చకులు ఉండగా మరో 13 మంది పట్టణానికి చెందినవారు ఉన్నారు. దీంతో ఆలయంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 83 చేరింది.

మరోవైపు ఆలయంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆలయ అధికారులు పలు ఆంక్షలు విధించారు. స్వామివారి ఆర్జీత సేవలు, నిత్యాన్నదానాన్ని నాలుగు రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా దృష్ట్యా నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన అధికారులు భక్తులకు కేవలం లఘు దర్శనం మాత్రమే కల్పించబడుతుందని తెలిపారు.

Tags:    

Similar News