Swiggy: రంజాన్ మాసంలో స్విగ్గీకి ఆర్డర్ల మోత.. గతంతో పోలిస్తే 15శాతం ఎక్కవ
Swiggy: హైదరాబాద్ లో 10లక్షల బిర్యానీ ఆర్డర్లు
Swiggy: రంజాన్ మాసంలో స్విగ్గీకి ఆర్డర్ల మోత.. గతంతో పోలిస్తే 15శాతం ఎక్కవ
Swiggy: హైదరాబాద్‌లో స్పెషల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే భోజన ప్రియులు చాలా ఇష్టపడుతారు. హైదరాబాదీలు కూడా బిర్యానీని ఎక్కువగా ఆర్డర్ పెడుతుంటారు. బిర్యానీకి తోడు రంజాన్ మాసంలో అమితంగా నోరు ఊరించేది హలీమ్. రంజాన్ సీజన్ మొత్తం భోజన ప్రియులు ఎక్కువగా బిర్యానీ, హలీమ్‌లను ఆర్డర్ చేశారు.
అయితే రంజాన్ ఆర్డర్లపై స్విగ్గీ సైతం స్పందించింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి బిర్యానీ, హలీమ్ ఆర్డర్లు అధికంగా పెరిగినట్టు ప్రకటించింది. రంజాన్ మాసంలో దేశ వ్యాప్తంగా తమకు 60 లక్షల ఆర్డర్లు వస్తే, ఒక్క రంజాన్ మాసంలోనే 10 లక్షల ఆర్డర్లు వచ్చాయని ప్రకటించింది. మితగా నెలలతో పోలిస్తే ఇది 15 శాతం అధికమని స్విగ్గీ తెలిపింది. అలాగే 5లక్షల30 వేల హలీం ప్లేట్స్ ఆర్డర్స వచ్చనట్టు తెలిపింది. సాయంత్రం అయిదున్నర గంటల నుంచి ఏడు గంటల మధ్యకాలంలో అధికంగా హలీం, బిర్యానీ, సమోసా, ఫలూదా, ఖీర్ ఆర్డర్లు వచ్చినట్టు తెలిపింది.