Covid Vaccination: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు

Covid Vaccination: కోవిడ్‌ టీకా పంపిణీలో కోటి డోసులు పూర్తి * 5నెలల 10 రోజుల్లోనే కోటి వ్యాక్లిన్ల పంపిణీ

Update: 2021-06-26 02:36 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccination: మరో మైలురాయిని అధిగమించింది తెలంగాణ రాష్ట్రం. కోవిడ్‌ టీకా పంపిణీలో కోటి డోసులు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. అది కూడా 5 నెలల 10 రోజుల్లోనే కోటి టీకాలు అందించి.. హౌరా అనిపించింది రాష్ట్ర సర్కార్‌. ఇందులో ఫస్ట్‌ డోస్‌ 86 లక్షలు కాగా.. 14 లక్షలు సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారున్నారకు. ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభంకాగా.. ఏప్రిల్‌ 1నుంచి ఈ ప్రక్రియ కాస్త ఊపందుకుంది.

ఇక.. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సునవారిలో 40 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. తర్వాత 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులకు 36 లక్షల 97 వేల డోసులు ఇచ్చారు. 60 ఏళ్లు పైబడినవారికి 23 లక్షల డోసులు అందించారు. ఓవరాల్‌గా 52 లక్షల 52 వేల మంది పురుషులకు, 48 లక్షల 21 వేల మంది మహిళలకు టీకా పంపిణీ చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 81 లక్షల 52 వేల డోసులు కోవిషీల్డ్ ఇవ్వగా.. కోవాగ్జిన్‌ 18 లక్షల 85 వేల డోసులు ఇచ్చారు.

టీకా పంపిణీలో టాప్‌ పొజిషన్‌లో హైదరాబాద్‌ నిలిచింది. ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో హైదరాబాద్‌లో 19 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 11 లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో 10 లక్షల డోసుల చొప్పున పంపిణీ చేశారు. అత్యల్పంగా నారాయణ్‌పేట్‌ జిల్లాల్లో కేవలం 42 వేల డోసులే ఇచ్చారు. వరంగల్‌ అర్బన్‌లో 3 లక్షల 63 వేల డోసులు, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట‌, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 2 లక్షలకు పైగా డోసులు పంపిణీ చేశారు.

కోటి వ్యాక్సిన్లు పూర్తి చేసుకున్న ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే గొప్పరోజని అన్నారు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌. 30 వాహనాల ద్వారా మొబైల్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించామన్నారు. వచ్చే నెలలో రెండో డోసు వారికి ప్రాధాన్యత ఇస్తామని సీఎస్‌ చెప్పారు. కోఠిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమేశ్‌ కుమార్‌.. వ్యాక్సిన్‌ ప్రాముఖ్యతను తెలియజేసే వీడియోను విడుదల చేశారు. 

Full View


Tags:    

Similar News