Vivo T4 Ultra: వివో నుంచి రేపు మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే!

Vivo T4 Ultra: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో (Vivo) తన టీ4 సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది.

Update: 2025-06-10 05:00 GMT

Vivo T4 Ultra | వివో నుంచి రేపు మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్.. ఫీచర్లు ఇవే!

Vivo T4 Ultra: చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో (Vivo) తన టీ4 సిరీస్‌లో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే Vivo T4, Vivo T4x 5G ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ కంపెనీ, ఇప్పుడు 'Vivo T4 Ultra 5G' పేరిట మరో ఆకర్షణీయమైన డివైస్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ను జూన్ 11న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు.

ప్రధాన ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.67 అంగుళాల pOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ తో

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్

ఓపరేటింగ్ సిస్టమ్: Android 15 ఆధారిత Funtouch OS 15

RAM & స్టోరేజ్: LPDDR5X RAM, UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్

కెమెరా సెటప్:

రియర్ కెమెరాలు:

50MP సోనీ IMX921 ప్రైమరీ లెన్స్ (OIS సపోర్ట్‌తో)

50MP 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్

8MP అల్ట్రా వైడ్ లెన్స్

ఫ్రంట్ కెమెరా: 50MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ & ఛార్జింగ్:

5,500mAh బ్యాటరీ

90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్


వివో T4 Ultra 5G ధర సుమారుగా ₹35,000 లోపే ఉండొచ్చని అంచనా. ఇది Flipkart, Vivo India e-storeతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో లభించనుంది. గతంలో వచ్చిన Vivo T3 Ultra 5G మోడల్‌ను ₹31,999కి విడుదల చేసిన విషయం గుర్తుండాలి.

ఈ ఫోన్ అధునాతన ఫీచర్లతో, బడ్జెట్‌ ధరలో మిడ్-రేంజ్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

Tags:    

Similar News