iQOO Neo 10R: ఐక్యూ నుంచి మరో కొత్త సిరీస్.. లీకైన స్పెసిఫికేషన్స్..!

iQOO Neo 10R: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ త్వరలో భారతదేశంలో నియో 10ఆర్‌ను విడుదల చేయనుంది.

Update: 2025-01-25 06:55 GMT

iQOO Neo 10R: ఐక్యూ నుంచి మరో కొత్త సిరీస్.. లీకైన స్పెసిఫికేషన్స్..!

iQOO Neo 10R: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ త్వరలో భారతదేశంలో నియో 10ఆర్‌ను విడుదల చేయనుంది. ఐక్యూ కొన్ని నెలల క్రితం చైనాలో నియో 10 సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో నియో 10, నియో 10 ప్రో మోడల్‌లు ఉన్నాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు. అయితే ఇప్పుడు దాని ధర, స్పెసిఫికేషన్లు కొన్ని లీక్స్ ద్వారా వెల్లడయ్యాయి. 10 ఆర్ స్మార్ట్‌ఫోన్ 144Hz అమోల్డ్ డిస్‌ప్లే ప్యానెల్,  స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్, 50MP సోనీ LTY-600 మెయిన్ బ్యాక్ కెమెరా సెన్సార్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.

ఐక్యూ ఇండియా హెడ్ నిపున్ మార్య తన ఎక్స్‌లో కొత్త iQOO స్మార్ట్‌ఫోన్‌ని షేర్ చేశారు. పోస్ట్‌లోస్మార్ట్‌ఫోన్ మోడల్ పేరు వెల్లడించలేదు, కానీ టెక్స్ట్‌లో 'R' అక్షరాన్ని హైలెట్ చేశారు. ఈ పోస్ట్‌లో లాంచ్ టైమ్‌లైన్ లేదా దాని స్పెసిఫికేషన్‌లను పంచుకోలేదు. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఐక్యూ నియో 10R లో సోనీ కెమెరా ఉంటుంది. దీనిలో 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-టోన్ డిజైన్‌తో వస్తుంది.

అయితే నియో 10R 5G స్మార్ట్‌ఫోన్, భారతదేశ ధర,  లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించారు. అలాగే దాని స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 2025లో భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. ఇది కాకుండా భారతదేశంలో ఐక్యూ నియో 10R 5G ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ బడ్జెట్‌లో ఈ ఫోన్ ఇటీవల విడుదల చేసిన పోకో X7 ప్రో, పోకో F6, మోటరోలా ఎడ్జ్ 50 ప్రో వంటి ఫోన్‌లతో పోటీపడుతుంది.

అదే పోస్ట్‌లో స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి. ఐక్యూ నియో 10R 5జీ 'I2221' మోడల్ నంబర్‌తో వస్తుందని చెబుతున్నారు. ఇది 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే  కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని చెబుతున్నారు. దీనిని 8GB + 256GB,12GB + 256GB కాన్ఫిగరేషన్లలో అందించవచ్చు. ఈ ఫోన్‌లో 6,400mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రైమరీ రియర్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. అలానే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఈ ఫోన్ బ్లూ వైట్ స్లైస్, లూనార్ టైటానియం అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుందని కూడా పేర్కొన్నారు.

Tags:    

Similar News