Samsung Galaxy S25 Series: జాతర షురూ.. AI ఫీచర్లతో శాంసంగ్ నుంచి 3 కొత్త ఫోన్లు వస్తున్నాయ్
శాంసంగ్ జాతర షురూ.. AI ఫీచర్లతో సామ్‌సంగ్ నుంచి 3 కొత్త ఫోన్లు వస్తున్నాయ్
Samsung Galaxy S25 Series: శాంసంగ్ Galaxy S25 Series ఫోన్లను ఈవారం భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనుంది. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరలు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి. సామ్‌సంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో Samsung Galaxy S25, Samsung S25+, Samsung Galaxy S25 Ultra అనే మోడల్స్ ఉంటాయి. ఇది కాకుండా సామ్‌సంగ్ S25 స్లిమ్ లాంచ్ గురించి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఈ మోడల్‌ను దక్షిణ కొరియా మార్కెట్‌లో మాత్రమే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనవరి 22న జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో సామ్‌సంట్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ని ప్రారంభించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. దాని బేస్ గెలాక్సీ S25 మోడల్ 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 84,999. అదే సమయంలో దాని 12GB RAM + 512GB వేరియంట్ రూ. 94,999కి అందుబాటులో ఉంటుంది. దీని ముందు Galaxy S24 మోడల్ రూ. 74,999కి విడుదల చేసింది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25+ 12GB RAM + 256GB వేరియంట్ ప్రారంభ ధర రూ. 1,04,999. అదే సమయంలో దాని 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 1,14,999. Galaxy S24+ ప్రారంభ ధర రూ 99,999. ఈ సిరీస్‌లోని అత్యంత ప్రీమియం గెలాక్సీ S24 అల్ట్రా మోడల్‌లో 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 1,34,999. దాని 16GB RAM + 512GB వేరియంట్ ధర రూ. 1,44,999. టాప్ 16GB RAM + 1TB వేరియంట్ రూ. 1,64,999కి అందుబాటులో ఉంటుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ప్రీ-బుకింగ్ ప్రస్తుతం భారతదేశంలో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సిరీస్‌ను ప్రీ-బుకింగ్ చేస్తే రూ. 5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సిరీస్‌లోని అన్ని మోడల్‌లు క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, గెలాక్సీ AI ఫీచర్లు ఉంటాయి. గత సంవత్సరంతో పోలిస్తే సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో పెద్ద అప్‌గ్రేడ్‌లను చేస్తుంది. అప్‌గ్రేడ్‌లు ఫోన్ కెమెరా, బ్యాటరీలో కూడా చూడవచ్చు.