Samsung Galaxy S25 Ultra: దుమ్మురేపే ఫీచర్లతో సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా.. ధర, ఫీచర్లు ఇవే..!
Samsung Galaxy S25 Launch: దేశంలో సామ్‌సంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Samsung Galaxy S25 Ultra ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Samsung Galaxy S25 Ultra: దేశంలో సామ్‌సంగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Samsung Galaxy S25 Ultra ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 16GB RAM + 1TB మెమరీ వేరియంట్ మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.1,50,280. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందించారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో విడుదలైంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఫోన్ భారతీయ మార్కెట్‌లో 12GB RAM + 256GB స్టోరేజ్, 12GB RAM + 512GB స్టోరేజ్, 12GB RAM + 1TB స్టోరేజ్ తో మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే 16GB RAM వేరియంట్ అందుబాటులో లేదు.
దక్షిణ కొరియాలో 16 GB RAM + 1 TB మెమరీ వేరియంట్ ధర రూ.1,35,280. ఈ 16GB RAM + 1TB మెమరీ వేరియంట్ 12GB RAM + 1TB మెమరీ వేరియంట్‌కు బదులుగా చైనా, తైవాన్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర చైనాలో రూ.1,62,593.
తైవాన్‌లో 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,50,280. ఈ ధరలు ఆయా దేశాల కరెన్సీల ఆధారంగా ఉన్నాయి. భారతదేశంలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,29,999, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,41,999. 12GB RAM + 1TB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ ధర రూ.1,65,999.
అయితే 16GB RAM + 1TB మెమరీ వేరియంట్ భారతదేశంలో అందుబాటులో ఉంటే దాని ధర దాదాపు రూ. 2 లక్షలు అవుతుంది. అందుకే ఈ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయలేదు.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ప్రొటెక్షన్‌తో 6.9-అంగుళాల QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 OS, One UI 7, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అందుబాటులో ఉన్నాయి. ఫోటోల కోసం 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
8K వీడియో రికార్డింగ్, 100X జూమింగ్, 5X ఆప్టికల్ జూమింగ్, లేజర్ ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అందుబాటులో ఉన్నాయి. 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. IP68 రెసిస్టెంట్ ఉంది. టైటానియం కలర్ వేరియంట్‌లలో ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది.