Samsung Galaxy A55 5G: దీపావళికి స్పెషల్ డిస్కౌంట్.. శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Samsung Galaxy A55 5G: మీరు శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఎందుకంటే ఇప్పుడు నంబర్ వన్‌గా అమ్ముడవుతున్న Samsung Galaxy A55 5G ఫోన్‌ 41శాతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

Update: 2025-10-20 09:00 GMT

Samsung Galaxy A55 5G: దీపావళికి స్పెషల్ డిస్కౌంట్.. శాంసంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Samsung Galaxy A55 5G: మీరు శాంసంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఎందుకంటే ఇప్పుడు నంబర్ వన్‌గా అమ్ముడవుతున్న Samsung Galaxy A55 5G ఫోన్‌ 41శాతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయచ్చరు. ఈ ఫోన్ 5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

30fps వద్ద 4K రిజల్యూషన్‌ను రికార్డ్ చేయగల చాలా మంచి కెమెరా సెటప్‌, అత్యుత్తమ పనితీరును అందించే శక్తివంతమైన శాంసంగ్ ఎక్సినోస్1480 ప్రాసెసర్‌ను కూడా ఉంటుంది. వీటితో పాటు పెద్ద సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో ప్రీమియం గ్లాస్ ఫ్రంట్, బ్యాక్ డిజైన్‌ను పొందుతారు. ఈస్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలో నంబర్ వన్‌గా అమ్ముడైన Samsung Galaxy A55 5G ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.42,999కి లాంచ్ అయింది. కానీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో 41శాతం భారీ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.24,940కి కొనుగోలు చేయచ్చు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందచ్చు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా కొనుగోలు చేయచ్చు. ఫోన్ కండిషన్, బ్రాండ్‌ ఆధారంగా రూ. 24,100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్, గ్లాస్ ఫ్రంట్, బ్యాక్‌తో ప్రీమియం బిల్డ్‌తో వస్తుంది. ఉత్తమ భాగం ఏమిటంటే, దీనిని హై క్వాలిటీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ అందించారు.ఈ స్మార్ట్‌ఫోన్‌లో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది అద్భుతమైన కలర్స్, కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ శాంసంగ్ ఎక్సినోస్ 1480 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది, ఇందులో మెరుగైన గ్రాఫిక్స్ కోసం AMD-ఆధారిత Xclipse 530 GPU ఉంటుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీరు చాలా మంచి పనితీరును పొందుతారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14లో శాంసంగ్ One UI 6.1పై పనిచేస్తుంది. ఇది క్లీన్, కస్టమైజ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లు, 4 ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్లు కూడా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ 5000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కానీ మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి ఎందుకంటే బాక్స్‌లో అందించడం లేదు. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో 30fps వద్ద 4K రిజల్యూషన్ వరకు సులభంగా రికార్డ్ చేయచ్చు.

Tags:    

Similar News