Samsung Galaxy A55 5G: శాంసంగ్ 5జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్.. ఆఫర్ చూస్తే షాకైపోతారు..!

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు.

Update: 2025-10-18 12:30 GMT

Samsung Galaxy A55 5G: శాంసంగ్ 5జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్.. ఆఫర్ చూస్తే షాకైపోతారు..!

Samsung Galaxy A55 5G: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. మీరు తక్కువ ధరకు మంచి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Samsung Galaxy A55 5G బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌పై ప్రస్తుతం రూ.16,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా. ఇందులో 5,000mAh బ్యాటరీ, అమోలెడ్ ప్యానెల్, ఇన్-హౌస్ ప్రాసెసర్ ఉన్నాయి. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ A55 5G ఇప్పుడు అమెజాన్‌లో రూ.23,999కి అందుబాటులో ఉంది, ఇది దాని లాంచ్ ధర రూ.39,999 కంటే చాలా తక్కువ. అదనంగా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే రూ.719 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ తర్వాత దీని ధర రూ.23,300కి తగ్గుతుంది. ఇది నిజంగా ఆకట్టుకునే ఆఫర్. అలానే మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్, వారంటీ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందచ్చు, దీని కోసం మీరు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A55 5జీ 6.6-అంగుళాల అమోలెడ్ ప్యానెల్‌తో వస్తోంది. ఇది మృదువైన 120Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అత్యుత్తమ వ్యూ అనుభవాన్ని ఇస్తుంది. ఈ స్క్రీన్‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ ఉంది. ఇది స్క్రీన్‌పై గీతలు పడకుండా చేస్తుంది. శాంసంగ్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. వేగవంతమైన, మృదువైన ఆపరేషన్‌ను నిర్ధారిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్‌‌ సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 12MP సెకండరీ సెన్సార్లు, 5MP సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది, అద్భుతమైన ఫోటోలు, స్పష్టమైన వీడియో కాల్‌లను అందిస్తుంది.

Tags:    

Similar News