REDMI Turbo 5 Series launch: షావోమీ ధమాకా.. 9000mAh బ్యాటరీతో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ ఎంట్రీ..!

REDMI Turbo 5 Series launch: షియోమీ తన అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసిన రెడ్ మీ టర్బో 5 సిరీస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది.

Update: 2026-01-26 13:00 GMT

REDMI Turbo 5 Series launch: షావోమీ ధమాకా.. 9000mAh బ్యాటరీతో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ ఎంట్రీ..!

REDMI Turbo 5 Series launch: షియోమీ తన అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసిన రెడ్ మీ టర్బో 5 సిరీస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. జనవరి 29న చైనా వేదికగా ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ 'రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్'. సరికొత్త సాంకేతికతతో పాటు అద్భుతమైన ఫీచర్లను జోడించి, మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసేందుకు షియోమీ సిద్ధమైంది. ముఖ్యంగా ప్రాసెసర్ విషయంలో ఎక్కడా తగ్గకుండా మీడియాటెక్ డిమెంసిటీ 9500s చిప్‌సెట్‌ను ఈ ఫోన్‌లో తొలిసారిగా పరిచయం చేస్తున్నారు.

సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో కూడా కనిపించని రీతిలో, రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్‌లో ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని షియోమీ అమర్చింది. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే ఇదొక సంచలనమని చెప్పవచ్చు. భారీ బ్యాటరీ మాత్రమే కాకుండా, దీనికి తోడుగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో ఫోన్ నిమిషాల్లోనే రీఛార్జ్ అవుతుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది, దీని ద్వారా ఇతర చిన్న పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ సమస్యలతో సతమతమయ్యే గేమర్లకు మరియు ప్రయాణికులకు ఇది ఒక వరంలా మారనుంది.

డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ చాలా లగ్జరీ లుక్‌ను కలిగి ఉంది. దీనికి అమర్చిన అల్ట్రా-న్యారో బెజెల్స్ మరియు CNC మెటల్ ఫ్రేమ్ ఫోన్‌కు మరింత అందాన్ని ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఫ్లాగ్‌షిప్ ఫైబర్‌గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు మెటల్ రేస్‌ట్రాక్ షేప్ డెకో మరియు డబుల్ రింగ్ టర్బైన్ లైట్ స్ట్రిప్ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, TSMC అత్యాధునిక N3E ప్రాసెస్ ద్వారా తయారైన మీడియాటెక్ డిమెంసిటీ 9500s చిప్‌సెట్, Mali Immortalis-G925 MC12 GPU ఉండటం వల్ల, అత్యంత భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్ కూడా ఎంతో సునాయాసంగా సాగుతుంది. సీ బ్రీజ్ బ్లూ అనే సరికొత్త రంగులో ఈ ఫోన్ కస్టమర్లను పలకరించనుంది.

ఈ భారీ ఈవెంట్‌లో కేవలం స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా, రెడ్ మీ బడ్స్ 8 ప్రోను కూడా విడుదల చేస్తున్నారు. ఆడియో ప్రియుల కోసం ఇందులో డ్యూయల్ పీజోఎలక్ట్రిక్ సెరామిక్ డ్రైవర్లు , టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్లను ఏర్పాటు చేశారు. షియోమీ సొంత MIHC కోడెక్, LHDC-V5 సపోర్ట్‌తో అత్యున్నత స్థాయి ఆడియో అనుభూతి లభిస్తుంది. ముఖ్యంగా బయటి శబ్దాల నుంచి విముక్తి కల్పించేందుకు 55dB అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ఇందులో జోడించారు. పరిసరాల శబ్దాలను బట్టి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయ్యే అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈ బడ్స్ సొంతం.


హ్యారీ పోట్టర్ అభిమానుల కోసం షియోమీ ఒక అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో హ్యారీ పోట్టర్ ఎడిషన్ పేరుతో ఒక ప్రత్యేక ట్యాబ్లెట్‌ను కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ ప్యాడ్‌పై హాగ్వార్ట్స్ స్కూల్ బ్యాడ్జ్ ఎంగ్రేవింగ్ ఉండటంతో పాటు, లోపలి థీమ్స్ అన్నీ కూడా మ్యాజికల్ ప్రపంచాన్ని తలపించేలా డిజైన్ చేశారు. స్టోరేజ్ బ్యాగ్ కూడా మ్యాజికల్ స్కూల్ స్టైల్‌లో ఉండటం విశేషం. ఇలా ఒకేసారి స్మార్ట్‌ఫోన్, ఇయర్ బడ్స్ , స్పెషల్ ఎడిషన్ ప్యాడ్‌ను లాంచ్ చేస్తూ టెక్ ప్రపంచంలో షియోమీ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Tags:    

Similar News