Redmi 20x: లీకైన రెడ్ మీ 20X ఫీచర్లు.. ధర రూ.11 వేల లోపే?

Redmi 20x: అద్భుత ఫీచర్లతో త్వరలో రెడ్ మీ 20X విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-04-06 03:46 GMT

రెడ్ మీ 20X (ఫొటో ట్విట్టర్)

Redmi 20x: అద్భుత ఫీచర్లతో త్వరలో రెడ్ మీ 20X విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాది మేలో రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈఫోన్ కు నెక్ట్ వెర్షన్‌గా రెడ్ మీ 20ఎక్స్ లాంచ్ కానుందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను టిప్ స్టర్ షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో ఈ ఫోన్ ధర, కొన్ని స్పెసిఫికేషన్లు కూడా ఉన్నాయి.

రెడ్ మీ 20ఎక్స్ ధర, రంగులు (అంచనా)

టిప్ స్టర్ అంచనాల మేరకు, ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో రానుంది. దీని ధర 999 యువాన్లుగా(సుమారు రూ.11,200) ఉండనుంది. బ్లూ, గ్రీన్, సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం వెల్లడించలేదు.

ఇందులో 5జీ కనెక్టివిటీ, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే, 48 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో బ్యాక్ సైడ్ మూడు కెమెరాలు ఉంటాయంట. ఫోన్ డిజైన్ చూసేందుకు రెడ్ మీ నోట్ 10 5జీ లా ఉండనుంది. రెడ్ మీ 20ఎక్స్‌లో హైఎండ్ వేరియంట్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజే. రెడ్ మీ 20ఎక్స్ లో ఎండ్ వేరియంట్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

రెడ్ మీ 20ఎక్స్ స్పెసిఫికేషన్లు( అంచనా)

ఇది 6.5 అంగుళాల డిస్ ప్లే తో రానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Tags:    

Similar News