Oppo K13 Turbo: ఒప్పో ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బెస్ట్ డీల్ ఇది..!
Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీ, అధిక రిజల్యూషన్ కెమెరాతో వస్తుంది.
Oppo K13 Turbo: ఒప్పో ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బెస్ట్ డీల్ ఇది..!
Oppo K13 Turbo: ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ బ్యాటరీ, అధిక రిజల్యూషన్ కెమెరాతో వస్తుంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఈ మిడ్-రేంజ్ ఫోన్‌లో బలమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఒప్పో డివైస్‌పై భారీ డిస్కొంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో కొనుగోలుదారులు మరింత సేవింగ్స్ చేసుకోవచ్చు.
ఒప్పో K13 టర్బోలో 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. అమెజాన్‌లో ఈ వేరియంట్ ధర రూ. 25,198. ఒరిజినల్ లాంచ్ ధర రూ. 27,999. అంటే డైరెక్ట్ ధర తగ్గింపు రూ.2,700. స్కాపియా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే.. 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్టంగా రూ. 1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ధర ఫోన్. రూ. 23,938 అవుతుంది. అంటే మొత్తంగా రూ.4200 డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్‌లో ఒప్పో K13 టర్బోపై ఎక్స్‌చేంజ్ ఆప్షన్ ఉంది. పాత ఫోన్ ఇచ్చి గరిష్టంగా రూ. 23,800 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ వాల్యూ ఫోన్ కండీషన్, మోడల్, ఫంక్షనాలిటీపై ఆధారపడి ఉంటుంది. ఒప్పో K13 టర్బోలో 6.80 అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1280 x 2800 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 1,600 నిట్స్ వరకు వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆక్టా-కోర్ చిప్‌సెట్ మల్టీటాస్కింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. బాక్స్‌లోనే ఆండ్రాయిడ్ 15, కలర్ OS 15 ఇంటర్‌ఫేస్ ఉన్నాయి. భారీ 7000mAh బ్యాటరీ ఒప్పో K13 టర్బోలో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకే చార్జ్‌పై ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ వల్ల డౌన్ టైమ్ తక్కువ అవుతుంది.
రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది. f/1.8 అపర్చర్ ఉంది. సెకండరీ 2MP కెమెరా డెప్త్ ఫొటోగ్రఫీకి సహాయపడుతుంది. దీనికి f/2.4 అపర్చర్ ఉంది. ఈ ఒప్పో ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. f/2.4 అపర్చర్ ఉంది. మంచి లైటింగ్‌లో సెల్ఫీలు స్పష్టంగా వస్తాయి. వీడియో కాల్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. ఒప్పో K13 టర్బో 5G, 4G నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై 7తో వేగవంతమైన వైర్‌లెస్ పనితీరు ఉంది. బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ప్రస్తుత డిస్కౌంట్ వల్ల ఈ ఫోన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. హెవీ యూజర్లు, గేమర్లకు భారీ బ్యాటరీ సరిపడుతుంది. AMOLED డిస్‌ప్లే ఫోన్ లో వీడియో వ్యూ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ఈ సెగ్మెంట్‌లో కెమెరా, పర్‌ఫామెన్స్ తో ఒప్పో K13 టర్బో మిగతా ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది.