Motorola G05 4G: రూ.7వేలకే మోటో స్మార్ట్‌ఫోన్.. డీల్స్ అదిరాయ్..!

Motorola G05 4G: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో మోటరోలా G05 4Gని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు.

Update: 2025-10-19 11:44 GMT

Motorola G05 4G: రూ.7వేలకే మోటో స్మార్ట్‌ఫోన్.. డీల్స్ అదిరాయ్..!

Motorola G05 4G: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో మోటరోలా G05 4Gని భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. రూ. 7,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫోన్‌పై రూ.226 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ డీల్ కూడా అందిస్తున్నారు. ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. అలానే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డీల్, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ ఆఫర్‌లో రూ.7,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,550. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ ఉంది. ఫోన్‌పై సేల్‌లో రూ.755 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఆఫర్‌పై ఫోన్‌ను రూ.7,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు.ఫోన్‌పై రూ. 226 వరకు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌‌ను ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో కూడా దక్కించుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ డీల్ అనేది కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ, బ్రాండ్, మొబైల్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ మోటరోలా ఫోన్‌లో 6.67-అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 Hz, పీక్ బ్రైట్నెస్ 1000 నిట్‌లు. అలాగే, ఫోన్ స్క్రీన్ ప్రొటక్షన్ కోసం గొరిల్లా 3 ఉంది. ఫోన్ ర్యామ్ మొత్తం 12 జీబీ, 4జీబీ ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్‌కరి సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ హెలియో G81 Ultra చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది.

ఈ మోటరోలా ఫోన్‌లో సెల్ఫీల కోసం కంపెనీ ముందు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించింది. ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీ ఉంది. బయోమెట్రిక్ భద్రత కోసం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోన్‌లో డాల్బీ ఆడియో, బలమైన సౌండ్ కోసం డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.

Tags:    

Similar News