Smartphone Cleaning:మొబైల్ ఫోన్‌ని టిష్యూ లేదా క్లాత్‌తో శుభ్రం చేస్తున్నారా.. !

Smartphone Cleaning: మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు స్క్రీన్ మురికిగా మారడం సర్వసాధారణం.

Update: 2023-05-19 14:30 GMT

Smartphone Cleaning:మొబైల్ ఫోన్‌ని టిష్యూ లేదా క్లాత్‌తో శుభ్రం చేస్తున్నారా.. !

Smartphone Cleaning: మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు స్క్రీన్ మురికిగా మారడం సర్వసాధారణం. కానీ చాలామంది దీనిని శుభ్రం చేయడానికి క్లాత్‌తో రుద్దుతారు. లేదంటే టిష్యూ పేపర్‌తో తుడుస్తారు. అప్పటివరకు అది శుభ్రంగా మారుతుంది. కానీ ఈ పద్ధతి సరైనది కాదు. ఇలా శుభ్రం చేయడం వల్ల మొబైల్ ఫోన్ స్క్రీన్ త్వరగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో ఆ స్క్రీన్‌ను ఎలా శుభ్రం చేయాలి అనే దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ద్రవాన్ని ఉపయోగించవద్దు

మొబైల్ ఫోన్ స్క్రీన్ మురికిగా మారినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లిక్విడ్‌తో శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఫోన్ స్క్రీన్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే టిష్యూ పేపర్‌తో గట్టి వస్తువులతో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. మొబైల్ ఫోన్ మురికి స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించాలి. దీనివలన మొబైల్ స్క్రీన్‌ ప్రకాశిస్తుంది. ఇది ఎటువంటి హానిని కలిగించదు.

భద్రత కోసం ఈ ఏర్పాట్లు

మొబైల్ ఫోన్ స్క్రీన్ సురక్షితంగా ఉంచడానికి దానిపై స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా స్క్రీన్ గార్డ్‌ని ఇన్‌స్టాల్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మొబైల్ స్క్రీన్ శుభ్రంగా, సురక్షితంగా ఉంటుంది. అలాగే అరిగిపోయే ప్రమాదం కూడా ఉండదు. దీని కారణంగా మీ ఫోన్ చాలా కాలం పాటు పనిచేస్తుంది. అలాగే తరచుగా స్క్రీన్‌ని తుడిచే అలవాటు మానుకోవాలి.

Tags:    

Similar News