YouTube and X Down: యూట్యూబ్ చరిత్రలోనే అతిపెద్ద ఔటేజ్..!
యూట్యూబ్, ఎక్స్ పనిచేయక ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు షాక్
YouTube and X Down:యూట్యూబ్ చరిత్రలోనే అతిపెద్ద ఔటేజ్..!
యూట్యూబ్ చరిత్రలోనే అతిపెద్ద ఔటేజ్..!
మనం పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌తోనే కాలం గడుపుతాం. అందులోనూ ముఖ్యంగా వీడియోల కోసం యూట్యూబ్, తాజా అప్‌డేట్స్ కోసం ఎక్స్ (X) మన జీవితంలో భాగమైపోయాయి. అయితే, ఫిబ్రవరి 17 సాయంత్రం ఒక్కసారిగా నెటిజన్ల స్క్రీన్లపై "Something went wrong" అనే మెసేజ్ ప్రత్యక్షమై అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఏం జరిగింది?
యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఔటేజ్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ముఖ్య పరిణామాలు. డౌన్ డిటెక్టర్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా యూజర్లు సమస్యను రిపోర్ట్ చేశారు. కేవలం అమెరికాలోనే సుమారు 3.2 లక్షల ఫిర్యాదులు అందాయి. వీడియోలు ప్లే అవకపోవడం, వెబ్‌సైట్ లోడ్ కాకపోవడం, చివరకు యూట్యూబ్ టీవీ కూడా మొరాయించడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.భారత్, యూకే, కెనడా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.
యూట్యూబ్ కంటే ఒకరోజు ముందే (ఫిబ్రవరి 16న), ఎలోన్ మస్క్ సారథ్యంలోని 'ఎక్స్' (ట్విట్టర్) కూడా కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. ఫీడ్ రిఫ్రెష్ కాకపోవడం, లాగిన్ సమస్యలతో దాదాపు 40 వేల మందికి పైగా నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు.
అంత పెద్ద ప్లాట్‌ఫామ్స్ ఆగిపోగానే అందరిలోనూ మెదిలే మొదటి ప్రశ్న.. "ఎవరైనా హ్యాక్ చేశారా?" అని. అయితే భయపడాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పష్టం చేశాయి.
సాధారణంగా హ్యాకింగ్ జరిగితే డేటా లీక్ అవ్వడం లేదా అకౌంట్స్ మాయమవ్వడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ కేవలం 'యాక్సెస్' మాత్రమే ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఇవి కావచ్చు..ప్లాట్‌ఫామ్స్‌ను అప్‌డేట్ చేస్తున్నప్పుడు వచ్చే లోపాలు. ఒక్కసారిగా యూజర్లు పెరగడం వల్ల సర్వర్లపై ఒత్తిడి.నెట్‌వర్క్ కనెక్టివిటీలో తలెత్తే సాంకేతిక అవరోధాలు.
యూట్యూబ్ ఈ సమస్యపై స్పందిస్తూ, లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలిపింది. ఏది ఏమైనా, ఇలాంటి ఔటేజెస్ మన డిజిటల్ డిపెండెన్సీని మరోసారి గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుతం సేవలు పునరుద్ధరించబడినప్పటికీ, ఆ కొన్ని గంటల పాటు నెటిజన్లు మాత్రం తమ డిజిటల్ వినోదాన్ని మిస్ అయ్యారు.