Google VEP: ప్యాకేజీ ఇచ్చి పంపించేందుకు సిద్ధమైన టెక్ దిగ్గజం!

Google VEP: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కోసం 'స్వచ్ఛంద విరమణ ఆఫర్' (Voluntary Exit Program) పేరుతో బైఅవుట్ ఆఫర్‌ను ప్రకటించింది.

Update: 2026-02-15 12:19 GMT

Google VEP: ప్యాకేజీ ఇచ్చి పంపించేందుకు సిద్ధమైన టెక్ దిగ్గజం!

Google VEP: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కోసం 'స్వచ్ఛంద విరమణ ఆఫర్' (Voluntary Exit Program) పేరుతో బైఅవుట్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ వేగంతో పోటీ పడలేమని భావించే వారు లేదా బయటకు వెళ్లాలనుకునే వారు గౌరవప్రదమైన సెవరెన్స్ ప్యాకేజీతో నిష్క్రమించవచ్చని స్పష్టం చేసింది.

గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పంపిన మెమో ప్రకారం.. 2025ను కంపెనీ పటిష్టమైన స్థితిలో ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం టెక్ రంగంలో పోటీ 'విద్యుత్ వేగం'తో సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వేగాన్ని అందుకోలేకపోయినా లేదా గూగుల్ నుంచి వేరే అవకాశాల వైపు వెళ్లాలనుకున్నా ఈ స్వచ్ఛంద విరమణ పథకాన్ని ఎంచుకోవచ్చని సూచించారు. కృత్రిమ మేధ (AI) ప్రాధాన్యతను గుర్తిస్తూ షిండ్లర్ తన మెమోలో కీలక ఆదేశాలు జారీ చేశారు. GBOలోని ప్రతి ఉద్యోగి కంపెనీ లక్ష్యాల్లో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని చెప్పారు. మరింత ప్రభావవంతమైన పనితీరు కోసం ప్రతి ఒక్కరూ ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు.

ఎవరెవరు అర్హులు?

ఈ బైఅవుట్ ఆఫర్ ప్రధానంగా అమెరికాలోని గ్లోబల్ బిజినెస్ విభాగంలోని కొన్ని ప్రత్యేక బృందాలకు వర్తిస్తుంది.

అర్హత ఉన్నవారు: సొల్యూషన్స్ టీమ్‌లు, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్, ఇతర సంబంధిత విభాగాల వారు ఈ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.

అర్హత లేనివారు: కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే సేల్స్ బృందాలు, ఇతర కస్టమర్-ఫేసింగ్ రోల్స్‌లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో వీరిని మినహాయించినట్లు మెమోలో పేర్కొన్నారు.

గతంలోనూ బైఅవుట్లు..

గూగుల్ ఈ తరహా ఆఫర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఏడాది పొడవునా వివిధ కారణాలతో సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.

జూన్ 2025: 'ఆఫీసుకు వచ్చి పనిచేయాలి' (RTO) అనే నిబంధనను ఉల్లంఘించిన అమెరికా ఉద్యోగులకు బైఅవుట్లు ఇచ్చారు.

అక్టోబర్ 2025: యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తగ్గించారు.

టెక్ రంగంలో వస్తున్న పెను మార్పులు, ముఖ్యంగా ఏఐ ప్రాధాన్యత పెరగడంతో గూగుల్ తన మానవ వనరులను సరికొత్తగా తీర్చిదిద్దుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ స్వచ్ఛంద విరమణ కార్యక్రమానికి తెరలేపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News