Lava Bold N2: రూ.7,499 కే అదిరిపోయే ఫీచర్లతో 'బోల్డ్ N2' ఫోన్ లాంచ్..
Lava Bold N2: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava), బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త మొబైల్ 'లావా బోల్డ్ N2' ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.
Lava Bold N2: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava), బడ్జెట్ ప్రియుల కోసం సరికొత్త మొబైల్ 'లావా బోల్డ్ N2' ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం లుక్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కోరుకునే వారిని టార్గెట్‌గా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన దేశీయ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకునే వారికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వడానికి 'లావా బోల్డ్ N2' ఒక సూపర్ ఆప్షన్‌గా పని చేస్తుందని చెబుతున్నారు.
ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందంటే..
ఈ ఫోన్ ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎందుకు స్పెషల్ అంటే.. లావా తన కస్టమర్ల కోసం 'ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్' ఆఫర్‌ను యాప్స్ ఉండవు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది.
* డిస్‌ప్లే: 6.75 అంగుళాల పెద్ద స్క్రీన్ (HD+), స్మూత్ యూసేజ్ కోసం 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది.
* బ్యాటరీ: రోజంతా నిరంతరంగా వాడుకోవడానికి 5000mAh భారీ బ్యాటరీని అందించారు.
* కెమెరా: బ్యాక్ వైపు 13MP మెయిన్ కెమెరా, ఫంట్ర్ సెల్ఫీల కోసం 5MP కెమెరా ఉన్నాయి.
ధర:
* ధర: కేవలం రూ.7,499.
* వేరియంట్: 4GB RAM + 64GB స్టోరేజ్.
* ప్రాసెసర్: Unisoc SC9863A ఆక్టాకోర్ ప్రాసెసర్.
* సెక్యూరిటీ: వేగంగా అన్‌లాక్ చేయడానికి ఈఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది.
* ర్యామ్ ఎక్స్‌పాన్షన్: అవసరమైతే అదనంగా మరో 4GB వర్చువల్ ర్యామ్ పెంచుకునే సౌకర్యం.