Oppo Watch S: ఒప్పో నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Oppo Watch S: స్మార్ట్ పరికరాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఒప్పో, తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో 'ఒప్పో వాచ్ S'ను లాంచ్ చేసింది.
Oppo Watch S: ఒప్పో నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Oppo Watch S: స్మార్ట్ పరికరాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఒప్పో, తాజాగా గ్లోబల్ మార్కెట్‌లో 'ఒప్పో వాచ్ S'ను లాంచ్ చేసింది. అక్టోబర్‌లో చైనాలో విడుదలైన ఈ వాచ్, ఇప్పుడు యూరప్‌తో పాటు ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ప్రత్యేకతలు, ధర, హెల్త్ ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ స్మార్ట్‌వాచ్ ధర ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. జర్మనీలో దీని ధర సుమారు రూ.27 వేలు (259 యూరోలు) గా ఉంది. ఈ వాచ్ ఫాంటమ్ బ్లాక్, సిల్వర్ గ్లో కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ వెయిట్ విషయానికి వస్తే.. ఇది పట్టీ లేకుండా కేవలం 35 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. ఒప్పో వాచ్ S లో ప్రధాన ఆకర్షణ దీని డిస్‌ప్లే అని చెబుతున్నారు. సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లు ఎండలో సరిగ్గా కనిపించవు. కానీ ఈ వాచ్‌లో 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల సన్ లైట్‌లో కూడా ఈ వాచ్ స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి వస్తున్న 1.46-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ సూపర్ విజువల్స్‌ను అందిస్తుందంటున్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఈ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ధరించే వారికి కేవలం 60 సెకన్లలోనే వాళ్ల హార్ట్ బీట్, నిద్ర, ఒత్తిడి, రక్తంలో ఆక్సిజన్ వంటి వాటి వివరాలను ఒకేసారి చూపిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మీరు రన్నింగ్, సైక్లింగ్, టెన్నిస్ లేదా స్విమ్మింగ్ చేసినా.. మీ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి ఇందులో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ వాచ్ వాటర్ ఫ్రూఫ్‌గా వస్తుంది. దీని బ్యాటరీ పనితీరు విషయానికి వస్తే.. ఈ వాచ్‌లోని 339mAh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు వస్తుందని చెప్పారు. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ వాడుకుంటే సుమారు 4 రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ఫోన్ల రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ప్రీమియం డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, సూపర్ డిస్‌ప్లే కావాలనుకునే వారికి ఒప్పో వాచ్ S ఒక మంచి ఆప్షన్‌గా చెబుతున్నారు. ఇండియా ఈ వాచ్ రిలీజ్ తేదీ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.