iQOO Z10 Lite 5G: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే iQOO 5G ఫోన్..!

iQOO Z10 Lite 5G: ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి.

Update: 2026-01-18 15:30 GMT

iQOO Z10 Lite 5G: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.10వేల లోపే iQOO 5G ఫోన్..!

iQOO Z10 Lite 5G: ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో శక్తివంతమైన 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి iQOO Z10 Lite 5G ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. ప్రైమ్ సభ్యులకు ఇప్పటికే ఈ సేల్ అందుబాటులోకి రాగా.. సాధారణ వినియోగదారులకు కూడా భారీ తగ్గింపులతో స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. SBI బ్యాంకు కార్డులను ఉపయోగించే వారికి తక్షణ డిస్కౌంట్ లభిస్తుండటంతో.. ఈ క్రేజీ స్మార్ట్‌ఫోన్ ధర మరింత తగ్గి రూ.10వేల కంటే తక్కువ ధరకే దక్కుతుంది. ఈ హ్యాండ్ సెట్ సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం తక్కువ ధరకే కాదు.. అత్యంత పటిష్టమైన నిర్మాణ నాణ్యతతో రూపొందించబడింది. సాధారణంగా ప్రీమియం ఫోన్లలో కనిపించే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, SGS 5 స్టార్ యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ దీనిలో ఉన్నాయి. దీనివల్ల పొరపాటున ఫోన్ కింద పడినా డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాదు.. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకుల నుండి కూడా రక్షణ లభిస్తుంది.

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. iQOO Z10 Lite 5G ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో మెరుగైన అనుభూతిని ఇస్తుంది. అలాగే దీనిలోని 1000 నిట్స్ బ్రైట్‌నెస్ కారణంగా ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఈ ఫోన్‌లోని ఐ ప్రొటెక్షన్ ఫీచర్ కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది.

సాఫ్ట్‌వేర్, పెర్ఫార్మెన్స్ పరంగా iQOO Z10 Lite ఎక్కడా రాజీ పడలేదు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహకరిస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై నడిచే ఈ హ్యాండ్ సెట్‌కు 2 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

ఇకపోతే iQOO Z10 Lite మొబైల్లో 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా ఉండటం విశేషం. దీంతో ఫొటోలను మరింత క్వాలిటీగా మార్చడానికి AI ఎరేస్, AI డాక్యుమెంట్ మోడ్ వంటి ఫీచర్లు తోడయ్యాయి. వీటన్నింటికీ తోడు 6000mAh భారీ బ్యాటరీ ఉండటంతో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా టెన్షల్ లేకుండా వాడుకోవచ్చు. 5G కనెక్టివిటీతో స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందాలనుకుంటే ఈ సేల్‌ ద్వారా ఐకూ Z10 టైట్‌ను స్మార్ట్‌ఫోన్‌‌ను సొంతం చేసుకోవాల్సిందే.

Tags:    

Similar News