iQOO Z10: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డిజైన్.. 7,300mAh బ్యాటరీ..!

iQOO Z10: ఐక్యూ తన శక్తివంతమైన ఫోన్ iQOO Z10 5Gని ఇండియాలో అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Update: 2025-03-25 10:15 GMT

iQOO Z10: పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డిజైన్.. 7,300mAh బ్యాటరీ..!

iQOO Z10: ఐక్యూ తన శక్తివంతమైన ఫోన్ iQOO Z10 5Gని ఇండియాలో అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. విడుదల చేయడానికి ముందు, కంపెనీ సోషల్ మీడియాలో కొత్త టీజర్‌ను పోస్ట్ చేసింది. ఇందులో ఫోన్ ప్రత్యేకమైన ఆకర్షణీయమైన స్లిమ్ బాడీ డిజైన్, కలర్ ఆప్షన్లు వెల్లడయ్యాయి. అదనంగా కంపెనీ అమెజాన్‌లో హ్యాండ్‌సెట్‌ను కూడా టీజ్ చేసింది. 7,300mAh బ్యాటరీ, సూపర్ స్లిమ్ బాడీతో దేశంలోనే ఇదే మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

కొత్త X పోస్ట్‌లో iQOO Z10 దేశంలో గ్లేసియర్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో వస్తుందని కంపెనీ వెల్లడించింది. దీని మందం 7.89 మిమీ ఉంటుంది. ఈ ప్రమోషన్ పోస్టర్‌లో Vivo సబ్-బ్రాండ్ ఐక్యూ దాని రాబోయే iQOO Z10 ఫోన్ "7,300mAh బ్యాటరీతో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్" అని పేర్కొంది. అలాగే, అమెజాన్‌లో మైక్రోసైట్‌ను లైవ్ చేసింది.

ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ, సూపర్ స్లిమ్ డిజైన్‌ను కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌పోన్ విడుదల చేసిన తర్వాత అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో ఫోన్‌ను చూపుతుంది. అలానే ఆప్టికల్ ఈమేజ్ స్టెబిలైజేషన్‌తో ఫోన్‌లో డ్యూయల్ బ్యాక్ కెమెరాలు ఉంటాయి.

iQOO Z10 Features

ఐక్యూ Z10 ఏప్రిల్ 11న ఇండియా మార్కెట్లోకి వస్తుంవి. ఇది దేశానికి రాకముందే iQOO Z10 Turboతో పాటు చైనా మార్కెట్‌లో అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఐక్యూ ఉత్తమ పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoCతో ఈ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అలాగే ఫోన్‌లో 1.5K రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15-ఆధారంగా OriginOS 5లో రన్ అవుతుంది.

Tags:    

Similar News