iQOO Neo 10R: పవర్ ఫుల్ ఫీచర్స్‌తో ఐక్యూ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఐక్యూ నియో 10R స్మార్ట్‌ఫోన్ మార్చి 11న భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ టీజర్‌ను విడుదల చేశారు.

Update: 2025-02-12 06:02 GMT

iQOO Neo 10R: పవర్ ఫుల్ ఫీచర్స్‌తో ఐక్యూ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

IQOO Neo 10R

టెక్ కంపెనీ ఐక్యూ కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఐక్యూ త్వరలో Neo 10R ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఈ మొబైల్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా సేల్‌కి రానుంది. ఈ కొత్త ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

ఐక్యూ నియో 10R స్మార్ట్‌ఫోన్ మార్చి 11న భారత్‌లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ టీజర్‌ను విడుదల చేశారు. దీనికి కంపెనీ 'ర్యాజింగ్ బ్లూ' అని పేరు పెట్టింది. ఈ మొబైల్‌లో సర్కిల్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్ బ్లూ కలర్‌లో ఉంటుంది. ఈ కలర్‌ను భారత మార్కెట్‌లో మాత్రమే పరిచయం చేయనున్నారు.

ఐక్యూ నియో 10R స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 మెయిన్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ఈ మొబైల్‌లో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ Funtouch OS ఆధారంగా ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. ఫోన్‌లో 8GB + 256GB,12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి

ఐక్యూ నియో 10R ఫోన్ 6400mAh కెపాసిటీ గల బ్యాటరీతో విడుదల కానుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. మొబైల్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది.ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ మొబైల్‌ను రూ. 30,000 కంటే తక్కువ ధరతో విడుదల చేయాలని చూస్తుంది.

Tags:    

Similar News