iQOO Neo 10R: త్వరలో మార్కెట్లోకి ఐక్యూ నియో 10 ఆర్.. లీకైన ఫీచర్స్

iQOO Neo 10R: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ భారతదేశంలో తన నియో సిరీస్‌లో కొత్త మిడ్ రేంజ్ హ్యాండ్‌సెట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.

Update: 2025-01-22 09:51 GMT

iQOO Neo 10R: త్వరలో మార్కెట్లోకి ఐక్యూ నియో 10 ఆర్.. లీకైన ఫీచర్స్

iQOO Neo 10R: వివో సబ్ బ్రాండ్ ఐక్యూ భారతదేశంలో తన నియో  సిరీస్‌లో కొత్త మిడ్ రేంజ్ హ్యాండ్‌సెట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే బ్రాండ్ ఇటీవల చైనాలో ఐక్యూ నియో 10, నియో 10 ప్రోలను ప్రారంభించింది. ఇప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్  కంపెనీ మొదటి 'R' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ కొత్త ఫోన్‌ను iQOO Neo 10R పేరుతో మార్కెట్లోకి వస్తుంది. ఫిబ్రవరి 2025లో లాంచ్ కావచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఓ టెక్ ప్రియుడు ధర, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి అన్ని ప్రధాన ఫీచర్లను  వెల్లడించారు. ఇది ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని సూచిస్తుంది. ఈ రాబోయే హ్యాండ్‌సెట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

iQOO Neo 10R Leaked Features

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం..  iQOO నియో 10R మోడల్ నంబర్ I2221తో భారతదేశంలో ప్రారంభించవచ్చు. ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం  ఉంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్  8s Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 8GB/12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని కలిగి ఉంటుంది. 

ఆప్టిక్స్ గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ 50MP Sony LYT 600 ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో రావచ్చు. ముందు భాగంలో 16MP కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ రెండు కలర్స్‌లో రావచ్చు. అందులో బ్లూ వైట్ స్లైస్, లూనార్ టైటానియం ఉన్నాయి. ఇది పెద్ద 6,400mAh బ్యాటరీని కలిగి ఉండచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

iQOO Neo 10R Price

ఐక్యూ నియో 10 ఆర్ భారతదేశంలో ఫిబ్రవరి 2025లో విడుదల కావచ్చని తెలుస్తుంది. దీని ధర రూ.30,000 లోపు ఉండవచ్చని చెబుతున్నారు. iQOO ద్వారా నియో సిరీస్ 'R' స్మార్ట్‌ఫోన్‌ల గురించి లీక్‌లు మొదట డిసెంబర్ 2024లో కనిపించడం ప్రారంభించాయి.

Tags:    

Similar News