iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్.. కెమెరాలో 5 పెద్ద మార్పులు.. సెల్ఫీలు తీసుకోవడం మరింత సరదాగా మారుతుంది..!

iPhone 17 Series: యాపిల్ ఈ సంవత్సరం తన ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతోంది, ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

Update: 2025-05-04 14:30 GMT

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్.. కెమెరాలో 5 పెద్ద మార్పులు.. సెల్ఫీలు తీసుకోవడం మరింత సరదాగా మారుతుంది..!

iPhone 17 Series: యాపిల్ ఈ సంవత్సరం తన ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయబోతోంది, ఇంకా కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతిసారీ లాగే, ఈసారి కూడా కొత్త సిరీస్‌లో మనం చాలా పెద్ద మార్పులను చూడచ్చు. ఈసారి యాపిల్ డిజైన్‌తో పాటు కెమెరా విభాగంలో పెద్ద మార్పులు చేయబోతోంది. ఐఫోన్ 17 లైనప్‌లోని కెమెరాలో 5 అతిపెద్ద కెమెరా అప్‌గ్రేడ్‌లను చూడచ్చు. అలానే సెల్ఫీ ప్రియుల కోసం, కంపెనీ ముందు కెమెరాలో కూడా పెద్ద అప్‌గ్రేడ్ చేయబోతోంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iPhone 17 Series Front Camera

2025 లో వస్తున్న నాలుగు ఐఫోన్ మోడళ్లలో కొత్త 24-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండవచ్చని, ఇది ప్రస్తుత 12-మెగాపిక్సెల్ మోడల్ రిజల్యూషన్‌ను రెట్టింపు చేయగలదని చెబుతున్నారు. ఈ అప్‌గ్రేడ్ తక్కువ కాంతి వద్ద మెరుగైన పనితీరును, క్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది.

Triple 48MP Lens

ఇటీవలి నివేదికల ప్రకారం ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ మూడు 48-మెగాపిక్సెల్ సెన్సార్లు, ఒక ఫ్యూజన్ లెన్స్, ఒక అల్ట్రా-వైడ్ లెన్స్, ఒక కొత్త టెట్రాప్రిజం టెలిఫోటోను కలిగి ఉండవచ్చని సూచించాయి. ఇది మెరుగైన ఇమేజ్ డీటెయిల్స్, ఎక్కువ జూమ్, 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా, యాపిల్ డ్యూయల్ వీడియో రికార్డింగ్‌ను కూడా అందించగలదు, దీని ద్వారా ముందు, వెనుక కెమెరాలు ఒకే సమయంలో ఉపయోగించవచ్చు.

ఈసారి స్క్వేర్ కెమెరా బంప్ కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉందని లీక్‌లలో చెబుతున్నారు. ఐఫోన్ 17 ప్రో మోడల్ హారిజెంటల్ కెమెరా బార్‌తో కూడిన కాంపాక్ట్ ట్రయాంగులర్ లెన్స్ ఉంటాయి. LiDAR సెన్సార్, మైక్రోఫోన్, ఫ్లాష్ కెమెరా బార్ కుడి వైపున కనిపిస్తాయి. ఇది ఫోన్ వెనుక రూపాన్ని పూర్తిగా కొత్త రూపాన్ని ఇస్తుంది.

iPhone 17 Air 48MP Camera

ఈసారి యాపిల్ 5.5 మిమీ మందం మాత్రమే ఉండే అల్ట్రా-సన్నని ఐఫోన్ 17 ఎయిర్‌ను కూడా పరిచయం చేయబోతోంది. ఈ ఫోన్‌లో ఒకే ఒక 48-మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా కనిపిస్తుంది. ఇది అదే హారిజంటల్ కెమెరా బార్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, కానీ దాని సింగిల్-లెన్స్ సెటప్‌కు సరిపోయేలా కొంచెం చిన్నదిగా చేస్తారు.

iPhone 17 Changes

స్టాండర్డ్ ఐఫోన్ 17 దాని సుపరిచితమైన నిలువు డ్యూయల్-కెమెరా డిజైన్‌లో రావచ్చు. అయితే, సెన్సార్‌లో కొన్ని చిన్న మార్పులు ఉండచ్చు, ఇది తక్కువ-కాంతిలో మంచి పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్‌లో 24-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని కూడా రావచ్చు.

Tags:    

Similar News