iPhone 16: ఐఫోన్ 16పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. వదలొద్దు భయ్యో..!

iPhone 16: దీపావళి పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలు ఈ ఫెస్టివల్‌‌ని క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

Update: 2025-10-12 09:34 GMT

iPhone 16: ఐఫోన్ 16పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. వదలొద్దు భయ్యో..!

iPhone 16: దీపావళి పండుగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలు ఈ ఫెస్టివల్‌‌ని క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజలు కూడా ఇందు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ దీపావళికి ఐఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, దీపావళి సేల్ కారణంగా చాలా మోడళ్లు డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ ప్రకటించింది.యాపిల్ ఐఫోన్ 16ను బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు, ఈఎమ్ఐ ఆఫర్లతో సహా అనేక బెస్ట్ ఆఫర్‌లను అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్‌లో ఐఫోన్ 16 మొబైల్ 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.69,900కి అందుబాటులో ఉంది. 1శాతం డిస్కౌంట్ తర్వాత రూ.68,900కి కొనుగోలు చేయచ్చు. అంటే రూ.1,000 ఆదా చేయగలరు. అయితే ఈ ధరను మరింత తగ్గించే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై రూ. 3,444 తగ్గింపు పొందచ్చు. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.3,000 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. అదనంగా రూ.60,400 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందచ్చు. స్మార్ట్‌ఫోన్‌‌ను రూ. 3,161 ఈఎమ్ఐ ఎంపికతో కూడా కొనుగోలు చేయచ్చు.

ఐఫోన్ 16 ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే క్లియర్, షార్ప్ విజువల్స్‌ను అందిస్తుంది. కంపెనీ ఇందులో కొత్త A18 చిప్‌సెట్‌ అందించింది. ఇది చాలా స్మూత్, స్పీడ్‌గా రన్ చేస్తుంది. కెమెరా, వీడియో క్వాలిటీ విషయానికి వస్తే ఐఫోన్ 16‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ కెమెరా హైక్వాలిటీ, క్లియర్ ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది.

బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 3,561 mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో టెక్స్ట్ రైటింగ్ టూల్స్, ఆడియో రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కూడా ఉన్నాయి. ప్రస్తుతం, ఈ ఐఫోన్ మోడల్‌కు ప్రజల్లో డిమాండ్ ఉంది, అందుకే దీనిని అనేక అద్భుతమైన ఆఫర్‌ల ద్వారా వివిధ వెబ్‌సైట్‌లలో వివిధ ధరల విభాగాలలో అమ్మకానికి అందుబాటులో ఉంచుతున్నారు.

Tags:    

Similar News