Pixel 10 Series: ఆగస్టులో గూగుల్ పిక్సల్ 10 సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

Pixel 10 Series: గూగుల్ త్వరలో తమ కొత్త పిక్సెల్ 10 సిరీస్ ‌ను ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జరిగే మేడ్ బై గూగుల్ ఈవెంట్లో కొత్త పిక్సెల్ 10 సిరీస్‌తో పాటు, కొత్త పిక్సెల్ బడ్స్, పిక్సెల్ వాచ్‌ లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.

Update: 2025-07-18 04:00 GMT

Pixel 10 Series: ఆగస్టులో గూగుల్ పిక్సల్ 10 సిరీస్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్

Pixel 10 Series: గూగుల్ త్వరలో తమ కొత్త పిక్సెల్ 10 సిరీస్ ‌ను ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో విడుదల చేయనుంది. ఈ సంవత్సరం జరిగే మేడ్ బై గూగుల్ ఈవెంట్లో కొత్త పిక్సెల్ 10 సిరీస్‌తో పాటు, కొత్త పిక్సెల్ బడ్స్, పిక్సెల్ వాచ్‌ లను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ కు చెందిన మార్క్ గుర్మన్ షేర్ చేసిన మీడియా ఆహ్వానం ప్రకారం, మేడ్ బై గూగుల్ 2025 ఈవెంట్ ఆగస్టు 20న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ మేడ్ బై గూగుల్ అధికారిక X ఖాతా కూడా ఈ వార్తను ధృవీకరించింది. కంపెనీ ఈ రాబోయే ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ మేడ్ బై గూగుల్ అధికారిక యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్స్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనుంది.

గూగుల్ ఈవెంట్ సందర్భంగా కొత్త పిక్సెల్ 10 సిరీస్‌లో పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ మోడల్స్‌ను లాంచ్ చేయవచ్చు. వేగం, మల్టీటాస్కింగ్ కోసం ఈ కొత్త సిరీస్‌లో కంపెనీ టెన్సర్ జి5 చిప్‌సెట్ ను ఉపయోగించే అవకాశం ఉంది.



ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, కొత్త పిక్సెల్ వాచ్ 4ను కూడా విడుదల చేయవచ్చు. నివేదికల ప్రకారం, ఈ కొత్త వాచ్‌లో ప్రస్తుతం ఉన్న మోడల్‌లోని స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జనరేషన్ 1 ప్రాసెసర్నే కొనసాగించవచ్చు. రెండు సైజు ఆప్షన్లలో, 459mAh బ్యాటరీతో ఈ కొత్త వాచ్‌ను లాంచ్ చేయవచ్చు. ప్రస్తుతానికి కంపెనీ రాబోయే ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయితే, పిక్సెల్ 10 సిరీస్, కొత్త వాచ్‌తో పాటు కస్టమర్‌ల కోసం కొత్త పిక్సెల్ బడ్స్ 2ఎను విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త ఇయర్‌బడ్స్ ధర 149 యూరోలు (సుమారు రూ.14 వేలు) ఉండవచ్చు.

ఈ సంవత్సరం పిక్సెల్ 10లో టెలిఫోటో కెమెరా సెన్సార్‌ను చేర్చవచ్చు, అయితే ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలను కొంతవరకు డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఫోల్డబుల్ పిక్సెల్‌ను బ్యాటరీ, మన్నిక పరంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.

Tags:    

Similar News