Google Pixel 10 Diwali Offers: లిమిటెడ్ ఆఫర్.. పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్..!

Google Pixel 10 Diwali Offers: ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను వేగంగా విడుదల చేస్తున్నాయి, ఇది చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది.

Update: 2025-10-19 14:00 GMT

Google Pixel 10 Diwali Offers: లిమిటెడ్ ఆఫర్.. పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్..!

Google Pixel 10 Diwali Offers: ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను వేగంగా విడుదల చేస్తున్నాయి, ఇది చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తుంటే Google Pixel 10 మీకు గొప్ప ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ. 12,000 కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికి వస్తే భారతదేశంలో రూ. 79,999కి లాంచ్ అయింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ నుంచి 14శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఫోన్‌ రూ. 68,530కి అందుబాటులో ఉంటుంది. దాదాపు రూ. 12,000 ప్రత్యక్ష తగ్గింపు పొందుతారు. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ లావాదేవీలపై కొనుగోలు చేస్తే రూ.1,250 డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే ధర మరింత తగ్గుతుంది. రూ.44,050 వరకు ఆదా చేస్తారు. మీరు దీన్నిరూ.3,325 EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయచ్చు.

గూగుల్ పిక్సెల్ 10లో 120 Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ సపోర్ట్‌తో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే‌కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంది. ఇది బలంగా, స్క్రాచ్-రెసిస్టెంట్‌గా చేస్తుంది.కెమెరా గురించి చెప్పాలంటే, మాక్రో ఫోకస్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.ఈ ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4,970mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌‌కి సపోర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News