Diwali Special Deal: దీపావళి స్పెషల్.. రూ.6,799కే శాంసంగ్ ఫోన్..!
Diwali Special Deal: దీపావళి సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ కామర్స్ సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మీకు పోటీ పడి మరీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
Diwali Special Deal:దీపావళి స్పెషల్.. రూ.6,799కే శాంసంగ్ ఫోన్..!
Diwali Special Deal: దీపావళి సందర్భంగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ కామర్స్ సైట్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు మీకు పోటీ పడి మరీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్స్ కనిపిస్తున్నాయి. Samsung Galaxy M07 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ మొదట అమ్మకానికి వచ్చినప్పుడు రూ.6,999 ధరకు అమ్ముడైంది. దీపావళి స్పెషల్ డీల్ చివరి రోజున దీని ధర రూ.6,799. ఫోన్ అప్ గ్రేడ్ చేయాలనుకునే వాళ్లు ఈ డీల్ పై ఓ లుక్కేయండి..!
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు రూ.203 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ రూ.330 నుండి ప్రారంభమయ్యే EMIతో కూడా ఆర్డర్ చేయచ్చు. ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ, ఫోన్ కండిషన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ నుండి పొందే డిస్కౌంట్ మొత్తం ప్రభావితం చేస్తాయి.
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 720 x 1600-పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 Hz. 64GB eMMC 5.1 స్టోరేజ్, 4GB ర్యామ్ ఈ శాంసంగ్ ఫోన్‌లో చూడచ్చు. మీడియాటెక్ హెలియో G99 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్‌తో కంపెనీ ఫోటోగ్రఫీ కోసం LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. దీనికి 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్,50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఉన్నాయి.
ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. 25W వేగవంతమైన ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ OneUI 7, ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌కి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C కనెక్టర్, డ్యూయల్ 4G వోల్ట్, 3.5మి.మీ హెడ్‌ఫోన్ జాక్ అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఎంపికలలో ఉన్నాయి.