Best 125CC Scooters: తక్కువ ధర.. తిరుగులేని పనితీరు.. మార్కెట్లోని బెస్ట్ 125సీసీ స్కూటర్లు ఇవే
Best 125CC Scooters: ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌లో రోజువారి అవసరాల్లో ఎక్కడికైనా సమయానికి చేరుకోవాలంటే టూవీలర్ కచ్చితంగా ఉండాలి.
Best 125CC Scooters: ప్రస్తుతమున్న బిజీ లైఫ్‌లో రోజువారి అవసరాల్లో ఎక్కడికైనా సమయానికి చేరుకోవాలంటే టూవీలర్ కచ్చితంగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లడం వల్ల ఆఫీస్‌కి ఆలస్యం కావచ్చు. అయితే క్యాబ్ తీసుకొని పోతే ట్రాఫిక్‌లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ప్రతిరోజూ ఆఫీస్‌తో పాటు ఇతర పనులకు వెళ్లే వారికి బైకులతో పోలిస్తే, గేర్ మార్చే పనిలేకుండా రయ్యుమని దూసుకుపోయే స్కూటర్లే బెస్ట్ ఆప్షన్. మహిళలు సైతం స్కూటర్లను సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అందుకే ఇప్పుడు 125 CC సెగ్మెంట్‌లో వస్తున్న అత్యుత్తమ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
హోండా యాక్టివా 125
యాక్టివా భారత్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్. యాక్టివా 125 స్కూటీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,442 నుండి రూ. 97,146 మధ్య ఉంటుంది. ఇందులో 123.92 CC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ స్కూటర్ లీటరుకు 47 కిమీల మైలేజీని ఇస్తుంది. యాక్టివా పెరల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ సైరన్ బ్లూతో సహా 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హోండా యాక్టివా ఫీచర్ల విషయానికొస్తే.. TFT కన్సోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ యాక్టివా 125 బైక్ బరువు 109 కిలోలు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లుగా ఉంది.
సుజుకి యాక్సెస్ 125
సుజుకి యాక్సెస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,700. ఇందులో 125 CC పెట్రోల్ ఇంజన్ ఉంది. స్కూటర్ లీటరుకు 45 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. స్కూటర్ మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రే వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బీజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. డిజిటల్-ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఉన్నాయి. భద్రత కోసం ముందు డిస్క్ బ్రేక్‌లు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇందులో అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ యాక్సెస్ 125 స్కూటర్ బరువు 103 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5 లీటర్లు.
హీరో జూమ్ 125
ఈ కొత్త స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 86,900 గా ఉంది. ఇందులో 124.6 CC పెట్రోల్ ఇంజన్ ఉంది. లీటరుకు 45 కిమీల మైలేజీని ఇస్తుందని అంచనాలు చెబుతున్నాయి. స్కూటర్ మెటాలిక్ టర్బో బ్లూ, మాట్ స్టార్మ్ గ్రేతో సహా అనేక కలర్ ఆప్షన్స్‌లో ఉంది.
ఈ కొత్త హీరో జూమ్ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే, సేఫ్టీ కోసం ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, USB ఛార్జింగ్ పోర్ట్, అండర్-సీట్ స్టోరేజ్ లైట్, డిస్క్, డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.