Samsung Galaxy S25: దీపావళి ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ డిస్కౌంట్..!

Samsung Galaxy S25: అమెజాన్ దీపావళి ఎడిషన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై కస్టమర్లకు భారీ డీల్‌లను అందిస్తోంది.

Update: 2025-10-19 03:30 GMT

Samsung Galaxy S25: దీపావళి ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ S25పై భారీ డిస్కౌంట్..!

Samsung Galaxy S25: అమెజాన్ దీపావళి ఎడిషన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై కస్టమర్లకు భారీ డీల్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ప్రస్తుతం చాలా పెద్ద డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. రూ.80,999కి లాంచ్ అయిన ఈ ఫోన్‌లో అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, హై-ఎండ్ డిజైన్ ఉన్నాయి. అయితే సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20 వేల కంటే ఎక్కువ తగ్గిపుతో కొనుగోలు చేయచ్చు. మీరు ఈ ఫోన్ కొనాలని చూస్తుంటే ఈ ప్రీమియం ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయి? ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? తదితర వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25ని రూ.62,070కి కొనుగోలు చేయచ్చు. ఇది అసలు ధర కంటే రూ.18,929 తక్కువ. వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే అదనంగా రూ.1,862 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు. ఫలితంగా, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ.60,208కి పడిపోతుంది, మొత్తం రూ.20,791 ఆదా అవుతుంది. అలాగే పాత ఫోన్‌ను అమెజాన్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా రూ.44,050 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటాయి.

శాంసంగ్ గెలాక్సీ S25లో 6.2-అంగుళాల FHD+ అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది 120 Hz ఫ్లెక్సిబుల్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే క్లియర్ పిక్చర్స్, ఫ్లూయిడ్ స్క్రోలింగ్‌ను ఆఫర్ చేస్తుంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ 4000mAh బ్యాటరీ 25W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ యూఐ 8పై పనిచేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 3x ఆప్టికల్ జూమ్‌తో10MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP ప్రైమరీ సెన్సార్ (OISతో) ఉన్నాయి. ఈ ఫోన్ కోసం కంపెనీ ఐసీ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ షాడో, పింక్ గోల్డ్, కోరల్ రెడ్, బ్లూ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News