Yuvraj Samra History: 58 బంతుల్లో సెంచరీ.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ చరిత్ర!
Yuvraj Samra History: పొట్టి ఫార్మాట్‌గా పేరున్న టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం భారీ ఘనత అనే చెప్పాలి. ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీలు కామనే అయినా... సెంచరీ మాత్రం కష్టమే. అలాంటిది.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో చిన్న వయసులోనే సెంచరీ కొట్టడం అరుదైన విషయం.
Yuvraj Samra History: 58 బంతుల్లో సెంచరీ.. టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ చరిత్ర!
Yuvraj Samra History: పొట్టి ఫార్మాట్‌గా పేరున్న టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేయడం భారీ ఘనత అనే చెప్పాలి. ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీలు కామనే అయినా... సెంచరీ మాత్రం కష్టమే. అలాంటిది.. టీ20 ప్రపంచకప్ టోర్నీలో చిన్న వయసులోనే సెంచరీ కొట్టడం అరుదైన విషయం. ఇప్పటివరకు జరిగిన ఎడిషన్లలో కొద్దిమంది మాత్రమే ఈ ప్రత్యేక రికార్డును నమోదు చేసి చరిత్రలో నిలిచారు. తాజాగా ఈ జాబితాలో అగ్రస్థానాన్ని కెనడా యువ బ్యాటర్ యువరాజ్ సమ్రా కైవసం చేసుకున్నాడు. 19 సంవత్సరాలు 141 రోజుల్లోనే శతకం సాధించిన సామ్రా.. టోర్నీ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సమ్రా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. మొత్తంగా 65 బంతుల్లో ఆరు సిక్స్‌లు, 11 ఫోర్లతో 110 పరుగులు చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ పాకిస్థాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. షెహజాద్ 22 సంవత్సరాల 127 రోజుల వయసులో సెంచరీ బాదాడు. మూడో స్థానంలో భారత మాజీ స్టార్ సురేష్ రైనా నిలిచాడు. రైనా 23 ఏళ్ల 156 రోజుల్లో 2010లో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించాడు. నాలుగో స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్ ఉన్నాడు. అతడు 25 ఏళ్ల 83 రోజుల్లో 2014లో శ్రీలంకపై శతకం బాదాడు. ఐదో స్థానంలో న్యూజిలాండ్ పవర్ హిట్టర్ గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు. ఫిలిప్స్ 25 ఏళ్ల 327 రోజుల్లో 2022లో శ్రీలంకపై సెంచరీ సాధించాడు.
యువరాజ్ సమ్రా భారతీయ మూలాలున్న కెనడా క్రికెటర్. 2006లో కెనడాలోని బ్రాంప్టన్‌లో యువరాజ్ జన్మించాడు. అతడి తండ్రి బల్జిత్ సింగ్ కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి వెళ్లి కెనడాలో స్థిరపడ్డాడు. బల్జిత్ స్థానిక లీగ్ గేమ్స్‌లో ఆడాడు. అతడికి ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ అంటే ఎంతో అభిమానం. అందుకే తన కుమారుడికి ‘యువరాజ్’ అని పేరు పెట్టాడు. యువరాజ్‌కు చిన్న వయసు నుంచే క్రికెట్ నేర్పించాడు. యువరాజ్ సింగ్ లాగే యువరాజ్ సమ్రా కూడా లెఫ్ట్ హ్యాండర్ కావడం ఇక్కడ విశేషం. 2019లో గ్లోబల్ టీ20 లీగ్ టోర్నీ కోసం యువరాజ్ సింగ్ కెనడా వెళ్లగా.. యువరాజ్ సమ్రా కలిశాడు. దాంతో అతడి అనడానికి అవధుల్లేకుండా పోయాయి. ఇపుడు సమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో సింగ్ ఆనంద పడే ఉంటాడు.