ఐపీఎల్ వేలంలోకి యువరాజ్ సింగ్‌ని విడుదల చేసిన ముంబయి

Update: 2019-11-16 04:01 GMT
Yuvraj Singh

ఇండియన్ ప్రీమియర్ లిగ్‌లో(IPL) గత సంవత్సరం టీమిండియా క్రికెటర్ యువరాజ్ ను ముంబై ఇండియన్స్ జట్టు తక్కువకు కొనుగోలు చేసింది. అయితే యువరాజ్ ను ముంబై ఇండియన్స్ వేలంలోకి వదిలింది. 2016 ఐపీఎల్ లో భీకర ఫోమ్ లో ఉన్న అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ 16 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లలో యువరజ్ రికార్డు నెలకొప్పాడు. తాజాగా యువరాజ్‌ను ముంబై జట్టుకూడా వేలానికి ఉంచింది. కోల్ కతాలో డిసెంబర్ 19న వేలం జరగనుంది. ఈ వేలానికి ముందుగానే ముంబై ఇండియన్స్ కొందరి ఆటగాళ్లను విడిచిపెట్టింది. వీరిలో యువరాజ్ తోపాటు హెండ్రిక్స్, బెన్ కటింగ్ లాంటి కీలక ఆటగాల్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్య, బుమ్రా, చాహర్, పొలార్డ్, మలింగ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.  యువరాజ్ సింగ్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 


Keywords : Yuvaraj Singh, Released, Mumbai Indians, IPL2020 ,Team India, Cricketer, Cricket,

Tags:    

Similar News