Abhishek Sharma: నేనింతే, ఇలానే ఆడుతా.. అభిషేక్ శర్మ షాకింగ్ కామెంట్స్!

Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరగడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Update: 2026-02-21 18:17 GMT

Abhishek Sharma: నేనింతే, ఇలానే ఆడుతా.. అభిషేక్ శర్మ షాకింగ్ కామెంట్స్!

Abhishek Sharma: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి మూడు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరగడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్, అత్యంత ప్రమాదకర ఓపెనర్ అనే ట్యాగ్‌లతో మెగా టోర్నీలోకి వచ్చిన అభి.. పరుగులు చేయకపోవడంతో అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతనికి ఇబ్బందులు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. కొందరు కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

అయితే టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అభిషేక్‌ శర్మపై పూర్తి విశ్వాసం ఉంచారు. అభిషేక్‌ తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడని, జట్టు అతడికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం (ఫిబ్రవరి 22) దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్ నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలపై అభిషేక్ స్వయంగా స్పందించాడు. తానింతే అని, ఇలానే ఆడుతా అంటూ విమర్శకులకు తనదైన శైలిలో ఘాటు సమాధానం ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన వీడియోలో అభిషేక్ మాట్లాడుతూ... తాను బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికే ఆడతానని చెప్పాడు. ఒత్తిడిని రెండేళ్ల కిందటే వదిలేశానని, తన నియంత్రణలో ఉన్నది కేవలం సన్నద్ధత మాత్రమేనని వివరించాడు. ఎక్కువగా సాధన చేయడం ద్వారా తన ఆటను మెరుగుపరుచుకోవడమే లక్ష్యమని చెప్పుకొచ్చాడు.

'టీ20 ప్రపంచకప్‌ 2026లో నేను పరుగులు చేయలేదు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాను. నా ఆట తీరును లేదా మైండ్‌సెట్‌ను మార్చే ఆలోచన లేదు. ప్రతి బ్యాటర్ కెరీర్‌లో ఇలాంటి ఒడిదొడుకులు సహజమే. కొన్ని మ్యాచ్‌ల్లో పరుగులు వస్తాయి, మరికొన్నింట్లో రావు. కానీ నేను ఎప్పటికీ దూకుడైన ఆటతీరుతోనే ఆడతా. ఫలితాలు రాకపోయినా అదే శైలిని కొనసాగిస్తా. అవసరమైతే అందుకోసం మరింత కష్టపడి సాధన చేస్తా' అని అభిషేక్‌ శర్మ స్పష్టం చేశాడు. మూడు మ్యాచుల్లోనూ డకౌట్‌ అవ్వడంతో అభిషేక్‌ను తప్పించి.. సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అందరూ సూచించారు. కానీ టీమ్ మేనేజ్‌మెంట్‌ మాత్రం అతడికి అండగా నిలిచింది. దక్షిణాఫ్రికాపై అతడు ఆడడం ఖాయం అయింది.

Tags:    

Similar News