WTC Final AUS vs IND: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌..

WTC Final AUS vs IND: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌..

Update: 2023-06-07 09:54 GMT

WTC Final AUS vs IND: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌..

WTC Final AUS vs IND: ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో..టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో రోహిత్ సేన బరిలోకి దిగింది. ఇక కీపింగ్ విషయంలో శ్రీకర్ భరత్‌ వైపే టీమిండియా మేనేజ్ మెంట్ మొగ్గుచూపింది. ఇక ఓవల్ పిచ్‌పై పచ్చిక కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, బౌలింగ్‌కే అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News