టీ20 ప్రపంచకప్‌‌కు టీమిండియా జట్టు ఇదే

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా మహిళజట్టును బీసీసీఐ ప్రకటించింది.

Update: 2020-01-12 16:38 GMT
T20 World Cup Representational image

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ఉమెన్ జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ కప్‌ జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనున్నారు. ఈ జట్టులో రిచా ఘోష్ కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇటీవలే జరిగిన మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీలో రిచా ఘోష్‌ రాణించిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 21 నుంచి ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా మహిళ జట్టులో తలపడనుంది. ఈ టోర్నీలో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గ్రూప్‌-ఎలో చోటు దక్కింది. గ్రూప్ ఏ లో భారత్ తోపాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. రెండో గ్రూప్- బీలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, థాయ్‌లాండ్ ఉన్నాయి.

భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ తొలిసారి ఈ టోర్ని ఆడనుంది. సినీయర్ ఓపెనర్ స్మృతి మంధానాతో షెఫాలీ వర్మ ఓపెనర్ గా దిగనున్నారు. ఈ జట్టులో బ్యాటింగ్ విషయానికి వస్తే జెమిమా రోడ్రిగ్జ్‌, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, హర్లీన్‌ డియోల్‌, తానియా భాటియా, రిచా ఘోష్‌ ఉన్నారు.స్పిన్ బౌలింగ్ బాధ్యతలు పూనం యాదవ్‌, రాధా యాదవ్‌ స్పిన్ విభాగం పంచుకోగా.. పేస్ దళం విషయానికి వస్తే రాజేశ్వరి గైక్వాడ్‌, శిఖా పాండే, పూజా వస్త్రాకర్‌లు ఉన్నారు.

ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియాలోనే నిర్వహిస్తున్న ముక్కోణఫు టీ20 టోర్నీకి జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రపంచకప్‌ జట్టు సభ్యులతో పాటు నుజహత్ పర్వీన్ చోటు దక్కించుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో టీమిండియా ముక్కోణఫు టోర్నీ ఆడుతుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు మెల్‌బోర్న్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.

ప్రపంచ కప్ జట్టు ఇదే :

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, రిచా ఘోష్, తానియా భాటియా, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్.

  


Tags:    

Similar News