Australia Cricket: పొగరుతో 'కప్‌' మీద కాళ్లు పెట్టారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు!

Australia Cricket: 1999, 2003, 2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లను ఆస్ట్రేలియా గెలిచింది. 1999 నుంచి 2015 వరకు ఆసీస్ ఆధిపత్యం కొనసాగింది. ఈ సమయంలో ఆసీస్ అంటే అన్ని జట్లు ముందుగానే ఓటమిని ఒపుకునేవి.

Update: 2026-02-17 14:31 GMT

Australia Cricket: పొగరుతో 'కప్‌' మీద కాళ్లు పెట్టారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు!

Australia Cricket: 1999, 2003, 2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌లను ఆస్ట్రేలియా గెలిచింది. 1999 నుంచి 2015 వరకు ఆసీస్ ఆధిపత్యం కొనసాగింది. ఈ సమయంలో ఆసీస్ అంటే అన్ని జట్లు ముందుగానే ఓటమిని ఒపుకునేవి. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఆసీస్ గెలవలేకపోయింది. 2015 తర్వాత ఆసీస్ ఆధిపత్యం తగ్గినా.. 2021 టీ20 ప్రపంచకప్‌, 2023లో వన్డే వరల్డ్‌కప్ గెలిచి ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తమ ఆధిపత్యంను చెలాయించింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. ఒకప్పుడు పెద్ద టోర్నీల్లో భయంకర ప్రత్యర్థిగా పేరున్న ఆసీస్.. ఇప్పుడు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరలేకపోవడం ఆస్ట్రేలియా పతనానికి సంకేతంగా భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియా అనేక ఓటములను చవిచూసింది. తొలిసారి ఆఫ్గనిస్తాన్ చేతిలో ఓడటం, 27 సంవత్సరాల తర్వాత స్వదేశంలోనే *వెస్టిండీస్ జట్టుపై టెస్ట్ మ్యాచ్ కోల్పోవడం ఆస్ట్రేలియా కు పెద్ద షాక్‌లుగా నిలిచాయి. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి, అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం కూడా ఆసీస్ ఫామ్ పడిపోయిందనే సంకేతాలు ఇచ్చాయి.

వన్డేల్లో కూడా ఆసీస్ పరిస్థితి మారలేదు. వరుసగా మూడు సిరీస్‌లలో పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో ఓటములు చూసింది. టీ20ల్లో భారత్ చేతిలో స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సిరీస్ కోల్పోవడం.. పాకిస్థాన్ చేతిలో వైట్‌వాష్ అవడం ఆసీస్ అభిమానులను నిరాశకు గురిచేసింది. 2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై ఓటమి, 13 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీలో శ్రీలంక చేతిలో పరాజయం చవిచూసిన ఆసీస్… చివరికి ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వరుస వైఫల్యాలు జట్టు భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అదే సమయంలో అభిమానులు సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ప్రపంచకప్‌ మీద కాళ్లు పెట్టినందుకే ఈ గతి అని కామెంట్స్ చేస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌ గెలిచాక మిచెల్‌ మార్ష్‌ ట్రోఫీ మీద కాళ్లు పెట్టి ఫొటోకు పోజిచ్చాడు. ఇపుడే అదే మార్ష్‌ సారథ్యంలో ఆసీస్ ఇంటికి వెళ్లింది. 'పొగరుతో కప్‌ మీద కాళ్లు పెట్టారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు' అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News