PAK vs NAM: టీ20 వరల్డ్‌కప్ రికార్డులు.. వ్యక్తిగత స్కోర్లు, టీమ్ టోటల్స్‌లో పాకిస్థాన్ చరిత్ర!

PAK vs NAM Records: టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్‌లు, భారీ స్కోర్లతో అభిమానులను అలరించింది.

Update: 2026-02-18 13:42 GMT

PAK vs NAM: టీ20 వరల్డ్‌కప్ రికార్డులు.. వ్యక్తిగత స్కోర్లు, టీమ్ టోటల్స్‌లో పాకిస్థాన్ చరిత్ర!

PAK vs NAM Records: టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు ఎన్నో మర్చిపోలేని ఇన్నింగ్స్‌లు, భారీ స్కోర్లతో అభిమానులను అలరించింది. ముఖ్యంగా కొందరు బ్యాటర్లు కీలక మ్యాచ్‌లలో అసాధారణ ప్రదర్శనలు చేసి.. జట్టు రికార్డు బుక్స్‌లో తమ పేర్లు లిఖించుకున్నారు. ఈ లిస్టులో టాప్ ప్లేయర్స్ లేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు పాక్ తరఫున నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్లు, అలాగే టీమ్‌గా సాధించిన భారీ టోటల్స్‌ను ఒకసారి చూద్దాం.

టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ 111 నాటౌట్. ఈ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. షెహజాద్ ఈ ఇన్నింగ్స్‌ను మిర్పూర్ వేదికగా 2014లో బంగ్లాదేశ్ జట్టుపై ఆడాడు. రెండో స్థానంలో సాహిబ్జాదా ఫర్హాన్ ఉన్నాడు. అతడు ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై సెంచరీ (100 నాటౌట్) ఈ ఘనత సాధించాడు. మూడో స్థానంలో 94 పరుగులతో ఉమ్రాన్ అక్మల్ ఉన్నాడు. ఆస్ట్రేలియాపై మిర్‌పూర్ వేదికగా 2014లో అక్మల్ ఈ స్కోర్ నమోదు చేశాడు.

జట్టు స్కోర్ల విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ అత్యధికంగా చేసిన స్కోర్ 201/5. ఈ భారీ టోటల్‌ను 2016లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై నమోదు చేసింది. రెండో స్థానంలో 199/3 స్కోర్ ఉంది. ఇది ఈరోజు నమీబియాపై కొలంబో ఎస్‌ఎస్‌సీ మైదానంలో నమోదైంది. మూడో స్థానంలో 191/6 స్కోర్ ఉండగా.. 2010లో గ్రాస్ ఐలెట్ వేదికలో ఆస్ట్రేలియాపై సాధించింది. అలాగే 191/5 స్కోర్‌ను మరోసారి ఆస్ట్రేలియాపై 2014లో మిర్‌పూర్‌లో నమోదు చేసింది.

ఈ గణాంకాలు చూస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో పాకిస్థాన్ జట్టు దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా బ్యాటర్లు మెరుస్తూనే.. జట్టుగా కూడా భారీ స్కోర్లు ఇవ్వగల సామర్థ్యం పాక్ జట్టుకు ఉందని ఈ రికార్డులు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ సూపర్ 8కు చేరింది. నమీబియాపై విజయంతో పాకిస్థాన్ తదుపరి దశకు చేరుకుంది.

Tags:    

Similar News